Army Agniveer : దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరాలనుకునే యంగ్‌స్టర్స్‌కు కేంద్రం అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు కరువై.. ప్రస్తుత తరుణంలో.. కేవలం టెన్త్ అర్హతతో దేశ చేసే అవకాశం కల్పిస్తోంది. అగ్నివీర్‌గా సైన్యంలో చేరేందుకు ఆహ్వానిస్తోంది. తెలంగాణ రాజధాని, విశ్వనగరం హైదరాబాద్ వేదికగా ఈ రిక్రూట్‌మెంట్ చేపట్టనుంది. డిసెంబర్ 8 నుంచి 16 వరకు వారం పాలు ఈ అగ్నివీర్‌ల నిరామక ర్యాలీ ఉంటుందని ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డ్ తెలిపింది.
పదో తరగతి అర్హత..
గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. పదో తరగతి అర్హత ఉన్నవారు అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ట్రేడ్స్‌మెన్ పోస్టుకు 8వ తరగతి అర్హత సరిపోతుందని పేర్కొంది.
వీటితో హాజరు కావాలి..
వారం రోజులపాటు నిర్వహించే అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌లో గతంలో ఎంపికలు నిర్వహించిన మిలటరీ పోలీసు అభ్యర్థులు, ఈ ఏడాది ఫిబ్రవరి 12నాటి నోటిఫకేషన్ ప్రకారం విద్యార్హత, స్థానికత, కుల ధ్రువీకరణ, ఈబీసీ తదితర సర్టిఫికెట్లు తీసుకుని హాజరు కావాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ఈ ర్యాలీకి ఆహ్వానిస్తోంది.
వయసు అర్హత..
అభ్యర్థుల వయసు 17 ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. మహిళా మిలటరీ పోలీస్(డబ్ల్యూఎంపీ) పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్లు బోర్డు తెలిపింది. రిక్రూట్‌మెంట్ పూర్తి పారదర్శకంగా ఉంటుందని వెల్లడించింది. డబ్బులు ఇస్తేజాబ్ ఇప్పిస్తామని చెప్పేవారిని నమ్మవద్దని సూచించింది. అభ్యర్థులు ఇతర వివరాలు, సందేహాల నివృత్తికి 040–27740059, 27740205 నంబర్లలో సంప్రదించాలని తెలిపింది.