World Chess Championship 2024: మనదేశంలో దిగ్గజ ప్లేయర్లు ఉన్నప్పటికీ మరోసారి భారత జట్టు ప్రపంచ ఛాంపియన్ గా నిలవలేకపోయింది. ఈసారి భారత జట్టుకు ఆ అవకాశం వచ్చింది. 12 సంవత్సరాల తర్వాత ప్రపంచ ఛాంపియన్ గా నిలిచే ఘట్టం 64 గడుల దూరంలో ఉంది. ఈసారి భారత్ తరఫున గుకేష్ బరిలో ఉన్నాడు. ఇతడి వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ గత నవంబర్ నుంచి ఇప్పటివరకు 37 రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కాదు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో తన ప్రత్యర్థి కంటే అందనంత ఎత్తులో ఉన్నాడు. అందువల్లే ఈసారి భారత్ ఛాంపియన్ గా అవతరిస్తుందని చదరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కొంతకాలంగా గుకేష్ స్థిరంగా ఆడుతున్నాడు. ఇటీవలి టోర్నీలలో అతడు వరుస విజయాలు సాధించడంతో 37 రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇవి చేస్తే గెలిచినట్టే..
ప్రపంచ చెస్ ఛాంపియన్ లో ఫేవరేట్లుగా కరువాన, నకమురా ను గుకేష్ ఓడించాడు.. తద్వారా సరి కొత్త సంచలనంగా ఆవిర్భవించాడు. గుకేష్ లిరెన్ తో ఇప్పటివరకు మూడుసార్లు క్లాసికల్ గేమ్ లలో పరస్పరం పోటీపడ్డాడు. అయితే ఇందులో లిరెన్ రెండు సార్లు గెలుపును సొంతం చేసుకున్నాడు.. ఒక గేమ్ మాత్రం డ్రా అయింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో టాటా స్టీల్ కంపెనీ నెదర్లాండ్స్ లో చెస్ టోర్నీ నిర్వహించింది. ఈ టోర్నీలో గుకేష్ పై విజయం సాధించాడు. 2023లో ఇదే టోర్నీలో గుకేష్ లిరెన్ పై విజయం సాధించాడు.. సింక్వి ఫీల్డ్ కప్ టోర్నీ మ్యాచ్ డ్రా అయింది. రెండు సంవత్సరాల తర్వాత భారతదేశానికి అవకాశం రావడంతో గుకెష్ కచ్చితంగా టోర్నీ గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ” లిరెన్ కొద్దిరోజులుగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఆట ఆడే సమయంలో ఇబ్బంది పడుతున్నాడు. పైగా తన పాయింట్లను కూడా కోల్పోతున్నాడు. ఇదే సమయంలో గుకేష్ అద్భుతమైన ప్రతిభ చూపుతున్నాడు.. పైగా అతని వయసు 18 సంవత్సరాలు మాత్రమే. అందువల్ల ఈసారి అతడు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా మానసిక ఒత్తిడిని అతడు జయించగలడు. అయితే వేగంగా ఎత్తులు వేస్తే మాత్రం ఇబ్బంది పడక తప్పదని” అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
ఫార్మాట్ ఎలా ఉందంటే
ఈసారి వరల్డ్ చెస్ ఛాంపియన్ టోర్నీ ఫార్మాట్ విభిన్నంగా ఉంది. తొలి 40 ఎత్తులకు 120 నిమిషాలు సమయం పడుతుంది. తర్వాత 20వత్తులకు 60 నిమిషాల సమయం పడుతుంది. మిగిలిన ఆటకు 15 నిమిషాలు పడుతుంది. 61 స్టెప్ నుంచి ప్రతి స్టెప్ కు 30 సెకండ్స్ ఎక్స్ ట్రా టైం ఇస్తారు. 41 స్టెప్ కు ముందు మాత్రం డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు.. ఇక ఫైనల్ పోరు లో గుకేష్, లిరెన్ 14 రౌండ్లలో తలపడతారు. ప్రతి విన్నింగ్ కు వన్ పాయింట్, డ్రా కు ఆఫ్ పాయింట్ లభిస్తాయి. ఇక 7.5 పాయింట్లకు చేరిన వారు విన్నర్లు అవుతారు. ఒకవేళ 14 గేమ్స్ అనంతరం ఇద్దరు సమ ఉకలోజ్జిలు అయితే.. టైప్ బ్రేకర్ విధానం ద్వారా ఛాంపియన్ ను ప్రకటిస్తారు.