Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Alliances: పవన్ పొత్తులపై విషం చిమ్ముతున్న ప్రత్యర్థులు

Pawan Kalyan Alliances: పవన్ పొత్తులపై విషం చిమ్ముతున్న ప్రత్యర్థులు

Pawan Kalyan Alliances: సినిమా హీరోలను ప్రజలు నెత్తికెక్కించుకునే స్థాయిలో లేరు… ఏపీలో పవన్ కళ్యాణ్ పై జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారం ఇది. సినిమా వేరు..రాజకీయాలు వేరు అని సంభోదిస్తున్నారు. ఆ ధైర్యంతోనే కాబోలు దశాబ్దాలుగా ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మార్చేశారు. అంతులేని విజయం.. అహంకారంతో కళ్లు బైర్లు కమ్మినప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదు. అది ఏపీలో వైసీపీకి అనుబంధంగా ఉండే అన్నిరంగాల వారి మాటలు ఇలానే కోటలు దాటుతున్నాయి.వారిలానే జగన్ కు భజన చేసేవారు మంచి వారు…తెలివైన వారు..ఉన్నతంగా ఆలోచించే వారని చెబుతారు. అదే జగన్ వ్యతిరేకిస్తే.. జగన్ పాలనను ప్రశ్నిస్తే తట్టుకోలేరు. ఎదుటి వారిని అవివేకులుగా చిత్రీకరిస్తారు. వారి వైఫల్యాలను ఎత్తిచూపుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా అలానే చూస్తున్నారు. తాము ఆరాధించి.. అభిమానించే నాయకుడ్ని ఎక్కడ అధికారం నుంచి దూరం చేస్తాడన్న భయంతో పవన్ తో పాటు జనసేనను ఏపీ సమాజంలో ఒక వైఫల్య నేతగా, వైఫల్య పార్టీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ అండ్ కో తో పాటు అనుబంధ మీడియాకు కూడా ఇదో పెద్ద టాస్కుగా మారిపోయింది.

Pawan Kalyan Alliances
Pawan Kalyan- modi, chandrababu

ఎనిమిదేళ్లలో జనసేన ఏం సాధించిందని ప్రశ్నిస్తున్నారు? ప్రారంభంలో ఎలా ఉందో అలానే ఉందని చెబుతున్నారు. అటువంటప్పుడు పవన్ ను పట్టించుకోవడం ఎందుకు? పవన్ వేసుకున్న దుస్తులు గురించి మాట్లాడతారు? పవన్ చదివే పుస్తకాలను ఎగతాళి చేస్తారు. చివరకు పవన్ ఇష్టంతో రూపొందించుకున్న ప్రచార రథంపై పగపడతారు? పవన్ వామపక్షాలతో జతకడితే తప్పుపడతారు? బీజేపీతో చెలిమి చేస్తే వద్దంటారు? ఇవన్నీ దేనికి సంకేతం? పవన్ కు బలం లేకుంటే ఆయన చర్యలను ఎందుకు గమనిస్తున్నట్టు? ఆయన ఎవరితో మాట్లాడితే మీకెందుకు? ఆయన ఎవరితో పొత్తు పెట్టకుంటే మీకెందుకు? జగన్ తరుపున వకల్తా పుచ్చుకునే కుహనా మేధావులు.. అనుకూల మీడియా అంతా పవన్ ను వాచ్ చేస్తుంటారు. అది జనసేనకు పెరిగిన బలం కాదా? పవన్ బలహీనుడైనప్పుడు సమయం వృథా చేసుకోవడాన్ని ఏమంటారు?

జనసేన ఆవిర్భవించి ఎనిమిదేళ్లు దాటుతోంది. అయినా అధికారంలో రాలేదని చెబుతున్నారు. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీని నడిపిన తీరును తప్పుపడుతున్నారు. కానీ ఏపీ రాజకీయ యవనికపై జనసేన పార్టీని నిలబెట్టారు అన్న విషయాన్ని మరిచిపోతున్నారు. వారికి తెలిసిందల్లా పార్టీ అంటే అనతికాలంలో అధికారంలో రావడం. పవర్ ను చేజిక్కించుకోవడం. జనసేనకు రాజకీయ వారసత్వం లేదు. సమాజంలో మార్పు అన్న నినాదంతో పవన్ పార్టీని స్థాపించి నడుపుతున్న కనీస విషయాన్ని కూడా గుర్తించలేకపోతున్నారు. పవన్ కు రాజకీయం తెలియదంటున్నారు. నిజమే రాజకీయం అంటే వారి ఉద్దేశ్యం అధికారంలోకి రావడమే. పాపం పవన్ తాను అధికారం కోసం కాదు.. ప్రజల సమస్యల పరిష్కారమే నా అజెండా అని చెబుతున్నారు. ఆ దిశగా ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం చూపించారు. కానీ దానిని కూడా మరుగునపరిచేలా చేస్తున్నారు. జనసేన వెనుక జనాల్లేరు అంటున్నారు. అయితే స్వచ్ఛందంగా జనసేనకు అండగా నిలిచేందుకు ముందుకొస్తున్న లక్షలాది మంది అభిమానులు, వీర మహిళలను సైతం కించపరుస్తున్నారు.

Pawan Kalyan Alliances
Pawan Kalyan Alliances

పవన్ ఇప్పటివరకూ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. 2014లో విభజిత ఏపీని అభివృద్ధి చేయాలంటే ఎన్డీఏ అవసరమని గుర్తించి మద్దతు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీని గెలిపించారు. కానీ ఏనాడూ అడ్వాంటేజ్ తీసుకోలేదు. విభజన హామీలు, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తప్ప మరి దేని గురించి ఆలోచించలేదు. కేంద్రంలో పదవులు తీసుకున్నారా? రాష్ట్రంలో కాంట్రాక్టులు పొందారా అంటే అదీ లేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేశారు. ఓటమి ఎదురైనా ప్రజల మీద ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేయలేదు. మళ్లీ సమస్యలనే అజెండాగా తీసుకొని ముందుకు సాగారు. ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకూ అధికారికంగా పొత్తులు సైతం కుదుర్చుకోలేదు. పొత్తు అనేది రాజకీయ పార్టీ ప్రధాన హక్కు. పొత్తు లేకున్నా.. పొత్తుకు మించి లబ్ధి పొందినది జగన్ కాదా? అన్న ప్రశ్నకు సమాధానం ఎవరైనా చెప్పగలరా? గత ఎన్నికల్లో చంద్రబాబును శత్రువుగా చూసిన బీజేపీ జగన్ కు సహకరించలేదా? ఏపీ ప్రజలను తూలనాడిన కేసీఆర్ జగన్ కు సహకరించలేదా? పొత్తు కంటే ఎక్కువగా ఆయాచిత లబ్ధి చేకూర్చలేదా? మీరన్నట్టు విఫల నేతగా ఉన్న పవన్ సఫల నేతగా మారేందుకు పొత్తులను ఆశ్రయిస్తే దానిని తప్పుపట్టే హక్కు కూడా మీకు లేదు. కేవలం జగన్ ను పవర్ నుంచి దూరం చేస్తాడన్న ఒకే ఒక భయమే పవన్ పై విష ప్రచారం.. ఆయన పొత్తుల చర్యలపై దుష్ప్రచారం. అంతకు మించి మాత్రం ఏమీ కనిపించడం లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version