Operation Sindoor: మిస్సైళ్లు దూసుకుపోయాయి. లక్ష్యాలను అత్యంత జాగ్రత్తగా చేదించాయి. చూస్తుండగానే ఉగ్రవాదుల స్థావరాలు నేలకూలిపోయాయి. ఫలితంగా ఇన్నాళ్లపాటు “మా దగ్గర ఉగ్రవాదులు లేరు.. ఉగ్రవాదులు అంటే ఎవరు కూడా మాకు తెలియదు” అని కల్లబొల్లి కబుర్లు చెప్పిన పాక్.. నిశ్శబ్దంగా ఉండిపోక తప్పలేదు. పాకిస్తాన్లో ప్రభుత్వం నాయకుల చేతిలో ఉండదు. వారు అక్కడి ఆర్మీ చేతిలో కీలుబొమ్మలు మాత్రమే. అక్కడ ఆర్మీలో ఉగ్రవాదులు కూడా ఉంటారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఆర్మీ పనిచేస్తూ ఉంటుంది. చూస్తుండగానే ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ నేరుగానే.. ముష్కరులకు మద్దతు పలికింది. ప్రభుత్వం ద్వారా ముష్కరులకు భవనాలు కట్టించడానికి సహాయం ప్రకటించేలా చేసింది.
పాకిస్తాన్ మీద దాడి చేశాం.. ముష్కరులకు చుక్కలు చూపించాం.. అని మన సైన్యం ఎంత గొప్పగా చెప్పినా.. మనదేశంలో ఉన్న కొంతమంది డర్టీ పొలిటిషయన్స్ ఆధారాలు అడిగారు. అసలు అవన్నీ ఎక్కడ ప్రయోగించారు అని ప్రశ్నించారు. అయితే అంతర్గత కావడంతో ఆ ప్రశ్నలకు భారత్ సమాధానాలు చెప్పలేకపోయింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ చెప్పిన విషయాలు మనదేశంలో కొంతమంది కుహానా రాజకీయ నాయకులకు చెంపపెట్టు లాగా ఉన్నాయి. దీంతో ఆ నాయకులు ఒక్కసారి గా సైలెంట్ అయిపోయారు. సరిగ్గా పార్లమెంట్ సమావేశాలకు ముందు పాకిస్తాన్ ఈ వివరాలను అంతర్గతంగా వెల్లడించడంతో అధికారంలో ఉన్న ఇండియా కూటమికి బలం వచ్చినట్టయింది. ఎందుకంటే ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి వాడిన మిస్సైల్స్.. ఉపయోగించిన యుద్ధ విమానాల గురించి వివరాలు ఇవ్వాలని ఓ పార్టీ అడుగుతున్నది. ఆపరేషన్ సిందూర్ విషయంలో కూడా తన రాజకీయ ప్రాపకం చూసుకుంటున్నది. సరిగా ఇదే దశలో పాకిస్థాన్ లో జరిగిన నష్టం పై అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ పార్టీ పీచే ముడ్ లాగా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది..
దాయాది దేశం మీద మన ఆర్మీ యుద్ధాన్ని చేపట్టి దాదాపు రెండు నెలలు పూర్తవుతుంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ అత్యంత వ్యూహాత్మకంగా దాడులు చేసింది. మన భూభాగం నుంచి దాడులు చేసి పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను అత్యంత చాకచక్యంగా నేలమట్టం చేసింది. మొదట్లో అలాంటి ఏది జరగలేదని పాకిస్తాన్ బుకాయించింది. ఇప్పుడు అదే పాకిస్తాన్ స్వయంగా నెత్తినోరు కొట్టుకుంటున్నది. భారత్ చేసిన దాడుల వల్ల తీవ్ర నష్టం జరిగిందని స్వయంగా పాకిస్తాన్ చెబుతోంది.. భారత్ చేసిన దాడుల్లో 9 ఉగ్రవాద స్థావరాలు, పదికి పైగా మిలటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, లాంచ్ ప్యాడ్లు ధ్వంసం అయ్యాయి. అయితే ఇప్పుడిప్పుడే వాటి పునరుద్ధరణ పనులను పాకిస్తాన్ మొదలుపెట్టింది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీకి అత్యంత కీలకమైన రహీమ్ యార్ ఖాన్ వైమానిక క్షేత్రం పనికి రాకుండా పోయింది. దీనికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. ఆగస్టు ఐదు వరకు దీనిని ఉపయోగించే పరిస్థితి లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఆదేశ ఏర్పోర్ట్ అథారిటీ “ఎన్ఓటిఏఎం” జారీ చేసిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.