Operation Sindoor: మంగళవారం అర్ధరాత్రి నుంచి పాకిస్తాన్ టార్గెట్గా భారత్ దాడులు మొదలు పెట్టింది. పాక్ లోని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా.. పాకిస్తాన్ పౌరులకు ప్రాణనష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా భారత్ దాడులు చేస్తోంది. చివరికి ప్రపంచ దేశాలు సైతం భారత్ చేస్తున్న దాడులను సమర్థిస్తున్నాయి. అమెరికా లాంటి దేశాలకు అక్కడ జరుగుతున్న పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు వివరిస్తోంది. ” మా ఉద్దేశం పాకిస్తాన్ దేశంలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం మాత్రమే. మాకు పాకిస్తాన్ ఆస్తులు టార్గెట్ కాదు. అక్కడి పౌరులు అంతకన్నా టార్గెట్ కాదు. అక్కడి పౌరులను చంపం. అక్కడి ఆస్తులను కూడా నేలమట్టం చేయం. మాకు కేవలం ఉగ్రవాదుల నామరూపాలు లేకుండా చేయడమే కావాలి. అలాంటి దానికోసం ఎంతదాకైనా వెళ్తామని”ప్రపంచ పెద్దన్న అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. నివేదికలు కూడా అమెరికా రాయబారికి పంపింది.
Also Read: ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే?
ఎలా సాధ్యమైందంటే..
ఇస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసింది. గురి తప్పకుండా పాముల వర్షం కురిపించింది.. దీనికోసం ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్సు ఈ భాగాలకు చెందిన ప్రిసిషన్ స్ట్రైక్ వెపన్ సిస్టమ్స్, లాయిటరింగ్ మ్యూనిషన్ వెపన్ ఉపయోగించింది. అటాక్ చేయాల్సిన ప్రాంతాలను ముందుగానే ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి, రక్షణ దళానికి అందించింది. దీంతో భారత సైన్యం మన భూభాగం నుంచే దాడులు మొదలుపెట్టింది. టార్గెట్ లొకేషన్ ను అత్యంత ఖచ్చితత్వంతో చేదించింది. దీనికోసం లైటరింగ్ మ్యూనిషన్ వెపన్ సహాయపడుతుంది. దీనిని ఉపయోగించి భారత దళాలు దాడులు చేశాయి. ఏకకాలంలో 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. వాస్తవానికి ఇతర ఆయుధాలు వాడితే ఒకేసారి వాటిని నేలమట్టం చేయడం సాధ్యం కాదు. లాయిటరింగ్ మ్యూనిషన్ వెపన్ ద్వారా భారత సైన్యం కట్టుదిట్టంగా దాడులు చేసింది. పాకిస్తాన్లో తల దాచుకున్న ఉగ్రవాదులు నోరు మెదపకుండా బాంబుల వర్షం కురిపించింది. చూస్తుండగానే వారి స్థావరాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతున్నాయి. ” భారత్ నుంచి బాంబులు ఏకకాలంలో దూసుకు వచ్చాయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొత్తానికి అక్కడ పరిస్థితి అంతు పట్టకుండా ఉంది. ఒకటి మాత్రం నిజం. భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసింది. ఆ దాడుల్లో ఉగ్రవాదులకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఆ నష్టం ఏ స్థాయిలో ఉందో ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. ఇటువంటి దాడులు గనుక భారత్ మరిన్ని చేస్తే పాకిస్తాన్లో ఉగ్రవాదులు అనేవారు ఉండరని” భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో నెటిజన్ల మధ్య విస్తృతమైన చర్చ జరుగుతోంది.
Also Read: పాక్ మీడియా బరితెగింపు.. అసత్యాలతో వాస్తవాల వక్రీకరణ