Operation Sindoor: పహల్గాం ఘటన వల్ల దేశం మొత్తం శోకంలో మునిగిపోయింది. నాటి ఘటనకు ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలని.. పాకిస్తాన్ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని మనదేశంలో సగటు పౌరుడి నుంచి డిమాండ్ వ్యక్తం అయింది. ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ కూడా అంతర్గతంగా జరిగిన భద్రత సమావేశాలలో చెప్పారు. గతంలో ఎన్నడు లేనివిధంగా భారత ఆర్మీకి ఆయన పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. ఏమాత్రం తేడా వచ్చినా ఖతం చేయాల్సిందేనని సూచనలు చేశారు. తద్వారా భారత త్రివిధ దళాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం.. రంగంలోకి దిగాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో జల్లెడ పట్టాయి. అడవులను తనిఖీ చేశాయి. సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహించింది. ఏమాత్రం అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టాయి. అయితే ఇవన్నీ కూడా సగటు భారతీయులకు ఏమంత సాంత్వన కలిగించలేకపోయాయి. వారిలో ఉన్న కోపాన్ని తగ్గించలేకపోయాయి. ఈ క్రమంలో సరిగ్గా బుధవారం తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఒకసారి గా మన దేశం సత్తా ఏమిటో పాకిస్తాన్ కి చూపించింది.
Also Read: ఆపరేషన్ సిందూర్: భారత్‌కు గర్వకారణం, పాక్‌కు షాక్
భారత్ లో సంబరాలు
పాకిస్తాన్లో ఉగ్రవాద స్థానాలపై భారత త్రివిధ దళాలు దాడులు చేయడంతో.. పాకిస్తాన్ అసలు రూపు బయట ప్రపంచానికి కనిపించడం మొదలుపెట్టింది. ఇన్నాళ్లపాటు తమ దేశంలో టెర్రరిస్టులు లేరని.. టెర్రరిస్ట్ క్యాంపులకు ఆస్కారం లేదని బుకాయించడం మొదలు పెట్టిన పాకిస్తాన్.. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ప్రపంచం ముందు దోషిగా నిలబడడంతో ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించింది. భారత్ చేసిన దాడుల వల్ల తమ పౌరులు చనిపోయారని వార్తలు ప్రసారం చేస్తోంది. కాకపోతే ఆర్మీ ధ్వంసం చేసిన తొమ్మిది స్థావరాలు ఉగ్రవాదులవేనని ప్రపంచానికి ఎప్పుడో తెలిసిపోయింది. మరోవైపు ఆర్మీ చేస్తున్న దాడులపై మనదేశంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సరైన సమయంలో సరైన విధంగా భారత ఆర్మీ వ్యవహరిస్తున్నదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో యువత భారత్ మాతాకీ జై.. ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటు నినాదాలు చేశారు. ఇక ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో ప్రజలు బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు వేడుకలు జరుపుకున్నారు. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గాం మృతులకు అసలైన నివాళి లభించిందని.. వారు పేర్కొంటున్నారు. “పహల్గాం మృతులకు శాంతి చేకూరింది. వారు పడిన దుఃఖానికి ఇన్ని రోజులకైనా నివాళి లభించింది. భారత ఆర్మీ స్ఫూర్తిదాయకమైన పనిచేసింది. ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదిలిపెట్టాలి. ఉగ్రవాదులను దూరం పెట్టాలి. అప్పుడే భారత్ ప్రశాంతంగా ఉంటుంది. పాకిస్తాన్ అభివృద్ధి బాట పడుతుందని” నెటిజన్లు అంటున్నారు.
Also Read: : ఉగ్రవాదానికి భారత్ సమాధానం.. ఒక చిత్ర కథ