Operation Sindoor: వందలాది మందిని పొట్టన పెట్టుకున్నాడు. అత్యంత కిరాతకమైన దాడుల్లో పాలుపంచుకున్నాడు. దాడులు చేయడానికి పురి కొలిపాడు. అమాయకులైన ముస్లింలను ఉగ్రవాదం వైపు నడిపించాడు. భారతదేశంపై లేనిపోని శత్రుత్వాన్ని నూరి పోశాడు. వారిని చదువుకు దూరం చేసి.. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదం వైపు మళ్ళించాడు. అతడు మాత్రం సేఫ్ గా ఉన్నాడు. కాదు తన కుటుంబాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇన్ని సంవత్సరాలు పాకిస్థాన్లో అత్యంత సురక్షితంగా ఉన్నాడు. పాకిస్తాన్ కేంద్రంగా తన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ను నడపడం మొదలుపెట్టాడు. విదేశాల నుంచి కోట్లకు కోట్లు విరాళాలు సేకరించడం ప్రారంభించాడు. అమాయకులైన ముస్లింలను ఉగ్రవాదులుగా చేసి.. భారత్ పై దాడులు చేయించాడు. అయితే ఇన్నాళ్లకు అతడి పాపం పండింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యం జరిపిన దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ ఇల్లు, అతడి ట్రైనింగ్ క్యాంప్ నేల కూలింది. పాకిస్తాన్లోని బహవల్పూర్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ అటాక్ చేయించింది. ఈ ఘటనలో మసూద్ కుటుంబ సభ్యులు ఏకంగా 10 మంది దాకా చనిపోయారని పాక్ మీడియా చెబుతోంది. అయితే చనిపోయిన వారిలో మసూదు ఉన్నాడా? లేదా? అనే విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు.
Also Read: ఆపరేషన్ సిందూర్: భారత్‌కు గర్వకారణం, పాక్‌కు షాక్
దారుణాతీదారుణాలు
మసూద్ భారత్ లో ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడు. కాశ్మీర్లో అల్లర్లకు పిలుపునిచ్చేవాడు. కాశ్మీర్ ముమ్మాటికి పాకిస్తాన్ దేశానిదేనని వ్యాఖ్యానించేవాడు. పదేపదే భారతదేశంపై విద్వేషాన్ని నూరిపోసేవాడు. అంతేకాదు గతంలో బలహీనమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు భారతదేశంలో దాడులు చేయించి.. మారణ హోమానికి పాల్పడ్డాడు. అందువల్లే మసూద్ ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్పించాలని భారత్ అనేక వేదికలలో పట్టు పట్టింది. అయితే మసూద్ విషయంలో చైనామెతక వైఖరి అవలంబించేది. అంతేకాదు అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్పించడానికి మోకాలు అడ్డు పెట్టేది. ఇన్నాళ్లకు భారత్ అతడి స్థావరంపై దాడి చేసి.. ఏకంగా పదిమందిని అంతమొందించింది. ఎన్ని సంవత్సరాలపాటు తమ దేశంలో ఉగ్రవాదులు లేరని.. ఉగ్రవాదులు శిబిరాలు ఏర్పాటు చేసుకోలేదని బుకాయించిన పాకిస్తాన్.. ఇప్పుడు భారత్ చేసిన వైమానిక దాడుల్లో తనే ఆ విషయాన్ని ఒప్పుకోవడం విశేషం. పాకిస్తాన్ మీడియాలో ఈ వార్తలు పదే పదే రావడంతో అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ మరోసారి తలవంచుకోవాల్సి వచ్చింది. ” పాకిస్తాన్ దేశానికి ఉన్న కాస్తో కూస్తో ఇజ్జత్ మొత్తం ఈ ఘటనతో పోయింది. ఇక పాకిస్తాన్ ప్రపంచం ముందు ఉగ్రవాద దేశంగా మోకరిల్లాల్సిందే. ఏ దేశం కూడా పాకిస్తాన్ కు అప్పు ఇవ్వదు. రూపాయి కూడా సహాయం చేయదు. ఇక పాకిస్తాన్ ఆకలితో అలమటించాల్సిందేనని” సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: ఉగ్రవాదానికి భారత్ సమాధానం.. ఒక చిత్ర కథ