Operation Sindoor Latest Update: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన 25 మంది యాత్రీకులు, ఒక నేపాలీ మృతిచెందాడు. మతం అడిగి కేవలం పురుషులనే ముష్కరులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటనతో యావత్ భారత్ ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తమైన సైన్యం, రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ.. ఈ ఘటనకు ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్‌ఎఫ్) అని నిర్ధారించారు. ఇది లష్కర్ – ఏ – తయిబా అనుబంధ సంస్థగా గుర్తించింది. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన ఉగ్రవాదులపై భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ను మే 7న ప్రారంభించాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై కచ్చితమైన దాడులు చేసింది. ఈ దాడుల్లో వంద మంది ఉగ్రవాదులు మరణించారు. దీంతో పాకిస్తాన్ యుద్ధం మొదలు పెట్టింది. దీంతో భారత్ కూడా ప్రతిదాడులు చేసింది. దీంతో పాకిస్తాన్‌లోని 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ఆయుధాలను ధ్వంసం చేసింది. భారత్ విజయానికి చేరువ అవుతున్న తరుణంలో సడెన్‌గా సీజ్‌ఫైర్ ప్రకటించారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సీడీఎస్ అనిల్ చౌహాన్ సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ అన్‌స్టాపబుల్ అని స్పష్టం చేశారు.
Also Read: నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక జాబులే జాబులు!
గెలుపు పొందు వరకు..
జనరల్ చౌహాన్ ప్రకారం, ఆపరేషన్ సిందూర్ ఒక నిరంతర కార్యక్రమం, ఇది భారత సైన్యం అప్రమత్తత, సంసిద్ధతను ప్రతిబింబిస్తుంది. యుద్ధంలో ’రన్నరప్‌లు’ లేరని, విజయం మాత్రమే లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. సైనిక సంసిద్ధత అనేది కేవలం యుద్ధ సమయంలోనే కాక, శాంతి కాలంలోనూ అత్యంత కీలకమని జనరల్ చౌహాన్ నొక్కి చెప్పారు. సైనిక దళాలు సంవత్సరం పొడవునా, వారంలో ఏడు రోజులూ అత్యంత తీవ్రమైన సంసిద్ధతతో ఉండాలని జనరల్ చౌహాన్ సూచించారు. ప్రస్తుతం సైనిక సాంకేతికతలో మూడో విప్లవం జరుగుతోందని, ఇది కృత్రిమ మేధస్సు, డ్రోన్ టెక్నాలజీ, సైబర్ యుద్ధం వంటి ఆధునిక రంగాలను కలిగి ఉందని తెలిపారు. భారత సైన్యం ఈ సాంకేతిక అభివృద్ధిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.
మొత్తంగా ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా పెట్టుకుంది భారత్. ప్రస్తుతం విరామం మాత్రమే అని, పాకిస్తాన్ తోక జాడితే.. కత్తిరించేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని చౌహాన్ హెచ్చరించారు.