Peaceful Sleep Tips: ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని.. సమస్యలు.. బాధలు… వీటి కారణంగా మనసు కకావికలం అవుతూ ఉంటుంది. దీంతో రాత్రి సమయంలో సరైన నిద్ర పట్టే అవకాశం ఉండడం లేదు. నిద్ర పట్టకపోవడంతో కొంతమంది మద్యం సేవించడం.. టీవీని చూడడం.. మొబైల్ తో కాలక్షేపం చేయడం వంటివి చేస్తున్నారు. కానీ ఇలా చేస్తే మరింత నిద్ర భంగం కలిగి అవకాశం ఉంటుంది. నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. కళ్ళు మూసుకున్న ఏవేవో ఆలోచనలు.. ఒకవేళ బలవంతంగా కళ్ళు మూసుకున్నా.. మనసు తృప్తి కాకుండా ఉండడం వంటివి అవుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి? నిద్ర పట్టాలంటే ఉండే సరైన మార్గం ఏంటి?
ప్రతి వ్యక్తికి నేటి కాలంలో 8 గంటల నిద్ర కచ్చితంగా అవసరం. ప్రతిరోజు సరైన ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోకన్నా.. కంటి నిండా నిద్ర ఉండడంవల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే బాధలు లేని వ్యక్తి అంటూ ఎవరూ లేరు.. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి విషయంలోనూ బాధపడుతూనే ఉంటారు. కానీ ఇలాంటి సమయంలో ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. అందులోనూ నిద్ర విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదు అని వైద్యులు అంటున్నారు. ఏదైనా సరే చేసి కచ్చితంగా నిద్రపోయే ప్రయత్నం చేయాలని అంటున్నారు.
Also Read: డార్క్ చాక్లెట్.. ఖర్జూర.. ఏది బెటర్?
అయితే నిద్ర పట్టక.. రాకుండా ఉండేవారు ఒక పనిని చేయడం వల్ల కచ్చితంగా మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది.. అదేంటంటే కళ్ళు మూసుకొని నిద్ర పోయినప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో కళ్ళకు ఒక మెత్తటి గుడ్డను కట్టుకోవాలి. ఇలా కట్టుకొని ధ్యానం చేస్తూ పడుకోవాలి. ఇష్ట దైవాన్ని స్మరిస్తూ నిద్రించడం వల్ల 15 నుంచి 20 నిమిషాల తర్వాత ఆటోమేటిగ్గా నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికి రాకపోతే అన్నిటికీ కారణమైన అమ్మవారిని స్మరిస్తూ ఉండడంవల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పటివరకు ఉన్న ఆలోచనలు అన్ని పక్కకు పెట్టి కేవలం మనసు కు నచ్చే విషయాలను మాత్రమే గుర్తు తెచ్చుకోవడం.. మనకు ఇష్టమైన పాట పాడడం.. లేదా ఏదైనా మంత్రాన్ని జపిస్తూ పడుకోవడం వల్ల కచ్చితంగా నిద్ర వచ్చే అవకాశం ఉందని కొందరు వైద్యులతో పాటు ఆధ్యాత్మిక నిపుణులు తెలుపుతున్నారు.
అంతేకాకుండా రాత్రిళ్ళు ఏదైనా పనుల కారణంగా నిద్రపోకపోతే.. మధ్యాహ్నం భోజనం చేసిన గంట తర్వాత కచ్చితంగా నిద్రపోయే ప్రయత్నం చేయాలి. మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల శరీరం ఉల్లాసంగా మారుతుంది. అయితే గంటలకు కాకుండా కేవలం ఒకటి లేదా రెండు గంటలు మాత్రమే నిద్రపోవాలి. అది కూడా గత రాత్రి నిద్ర చెడిపోతే మాత్రమే.. ఇలా నిద్ర విషయంలో ఖచ్చితమైన ప్రణాళిక వేసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నిద్ర లేకపోవడం వల్ల అనేక అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంటుంది.