Mahesh Babu and Pawan Kalyan : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప రికార్డులను క్రియేట్ చేసిన హీరోలు చాలామంది ఉన్నారు. అయినప్పటికి మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ ఏ హీరోకి లేదనే చెప్పాలి. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సైతం చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ అనే ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. యూత్ లో చాలా మంచి ఫాలోయింగ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.
Also Read : మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆ దర్శకుడితో సినిమా చేయాలనుకున్నారా..?
సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటి నటులు ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటించి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారు. అందువల్లే చాలామంది హీరోలు వల్ల మార్కెట్ కోల్పోయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరో ప్రస్తుతం స్టార్ హీరోగా తనకంటూ గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఏపీ పాలిటిక్స్ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కూడా కొనసాగిస్తున్నాడు. అటు పొలిటిక్స్, ఇటు సినిమాలు రెండింటిని సమపాళ్లలో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.
అయితే ఆయనకి ప్రస్తుతం ఉన్న బిజీలో సినిమాలను చేయాలనే ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికి తమ అభిమానులు నిరాశపరచకూడదనే ఉద్దేశ్యంతో అవకాశం దొరికినప్పుడు సినిమాలకు సంబంధించిన డేట్స్ ని కేటాయించే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ స్టార్టింగ్ లో చాలా మంచి సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇక ‘సుస్వాగతం’ (Suswagatham) సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ సినిమాతో గొప్ప విజయాన్ని సాధించాడు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన దేవయాని (Devayani) ఆ తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా వచ్చిన నాని (Nani) సినిమాలో అతనికి తల్లిగా నటించింది. నిజానికి మహేష్ బాబు కంటే ఏజ్ లో దేవయాని చాలా చిన్నది అయినప్పటికి అతనికి తల్లిగా నటించి ఆ పాత్రలో మెప్పించిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ అయితే ఉండదు.
అయినప్పటికి దేవయాని అటు పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా మెప్పిస్తూనే మహేష్ బాబు తల్లిగా నటించి తన నటన లో పరిణితిని చూపించింది. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న నటులందరు మంచి పాత్రలను చేస గొప్ప విజయాలను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధిస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.