Homeజాతీయ వార్తలుOpen Auction Rajiv Swagruha Plots: ఇదేందయ్యా.. ఇది.. మేమెప్పుడు సూడలే!

Open Auction Rajiv Swagruha Plots: ఇదేందయ్యా.. ఇది.. మేమెప్పుడు సూడలే!

– హాట్‌ కేకుల్లా ‘అంగారిక’ ప్లాట్లు
– సామాన్యుడికి అందకుండా చక్రం తప్పుతున్న రియల్టర్లు
– స్థానికంగా లేని ధరకు వేలం పాడుతున్న వైంన..
– రాజీవ్‌ స్వగృహ డీడీ కట్టిన వారిలో ఆందోళ
– నిరాశగా వెనుదిరుగుతున్న మధ్య తరగతి పెట్టుబడుదారులు

Open Auction Rajiv Swagruha Plots: మధ్య తరగతి ప్రజలకు సొంతింటి స్థలం తక్కువ ధరకు, అన్ని అనుమతులతో దక్కాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇటీవల సర్కారు భూముల వేలానకి శ్రీకారం చుట్టింది. మొన్నటి వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భూములు విక్రయించిన ప్రభుత్వం తాజాగా కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజీవ్‌ స్వగ్రృహ ప్లాట్ల వేలం వేయాలని నిర్ణయించింది. తొలి విడతగా 290 ప్లాట్ల వేలం కోసం నెల క్రితమే నోటిఫికేష¯Œ జారీ చేసింది. సుమారు 800 మంది ప్లాట్ల వేలంలో పాల్గొనేందుకు దరకాస్తు చేసుకున్నారు. సోమవారం నుంచి వేలం ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్‌లోని వాసర గార్డెన్స్‌లో వేలం జరుగుతోంది.

Open Auction Rajiv Swagruha Plots
Open Auction Rajiv Swagruha Plots

కరీంనగర్‌ ప్లాట్ల ధరలతో పోటీ పడుతన్న రేట్లు..
కరీంనగర్‌ కార్పొరేషన్‌లోనే శివారు ప్రాంతాల్లో గజం భూమి ధర కనిష్టంగా రూ.5 వేల నుంచి గరిష్టంగా రూ.15 వేల వరకు ఉంది. కరీనంగర్‌లోని ప్రధాన ప్రాంతాల్లో గజం రేటు రూ.20 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంది. అయితే అంగారిక ప్లాట్లు.. కరీంనగర్‌కు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ. అంగారిక ప్లాట్లు ఉన్నది నుస్తులాపూర్‌ గ్రామపంచాయతీ. రాజీవ్‌ స్వగృహ నిర్మాణాల కోసం 20073–08 సంవత్సరంలో ఇక్కడ ప్లాట్లు ఏర్పాటు చేశారు. కొనుగోలు దారుల నుంచి రూ.5 వేల కూడా తీసుకున్నారు. తర్వాత రాష్ట్ర విభజనతో రాజీవ్‌ స్వగృహ నిర్మాణం ఆగిపోయింది. నాడు ఇక్కడ ఇళ్ల నిర్మాణం కోసం సుమారు 20 నుంచి 50 గజాల వరకు భారీ గుంతలు తవ్వారు. ఇటీవల వీటినే అంగారిక టౌన్‌షిప్‌ పేరుతో ప్లాట్లుగా మార్చారు. పైపైన గుంతలు పూడ్చారు. పాత పిల్లర్లను కనిపించకుండా చేశారు. అయినా.. ఇక్కడి ప్లాట్లకు వేలంలో భారీగా ధర పలుకుతోంది. కరీంనగర్‌కు చెందిన రియల్టర్లు కుమ్మక్కయి స్థానికంగా లేని ధరను చెల్లించి ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో సొంత ఇల్లు కట్టుకుందామని, భవిష్యత్‌ అవసరాల కోసమని ప్లాట్లు కొనేందుకు వేలంలో పాల్గొనేందుకు వచ్చిన మధ్యతరగతి ప్రజలు వేలంలో రియల్టర్ల వెర్రిని చూసి ఆశ్చర్యపోతున్నారు. నిరాశగా వెనుదిరుగుతున్నారు.

Also Read: CM Jagan- Reddy Community: రెడ్డి సామాజికవర్గం వారికే కొలువులు, పదవులు, క్యాబినెట్ హోదాలు.. జగన్ తీరుపై విమర్శలు

వాస్తవం ధర చాలా తక్కువే..
తిమ్మాపూర్‌ మండలంలో రాజీవ్‌ రహదారి ఉన్నప్పటికీ భూముల ధరలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. అంగారిక టౌన్‌షిప్‌ రాజీవ్‌ రహదారికి సుమారు 500 మీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ భూముల ధరలు కనిష్టంగా రూ.3 వేల నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు ఉన్నాయి. తాజాగా రెండు రోజుల క్రితం జరిగిన రిజిస్ట్రేషన్‌ ప్రకారం కూడా రాజీవ్‌ రహదారికి పక్కన ఉన్న స్థలం గజం రూ.10 వేలకు వియ్రించారు. కానీ అంతగా డిమాండ్‌ లేని అంగారిక టౌన్‌షిప్‌ ప్లాట్లకు వేలంలో కొనుగోలుదారులు భారగా ధరం చెల్లించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Open Auction Rajiv Swagruha Plots
Open Auction Rajiv Swagruha Plots

రియల్టర్లు రింగయ్యారా..
అంగారిక టౌన్‌షిప్‌ ప్లాట్ల వేలం సోమవారం ప్రారంభం అయింది. రోజుకు 50 ప్లాట్ల చొప్పున వేలం నిర్వహించాలని అధికారులు నిర్వహించారు. మొదటి రోజు నిర్వహించిన వేలంలో 50 ప్లాట్లకు ఊహించన రీతిలో ధర పలికాయి. 11 కమర్షియల్‌ ప్లాట్లు, 49 రెసిడెన్షియ్‌ ప్లాట్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.20.46 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం చూసి ప్రభుత్వ అధికారులే ముక్కున వేలేసుకున్నారు. కమర్షియల్‌ ప్లాట్‌ గజానికి గరిష్టంగా ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.8 వేలు. రెసిడెన్షినల్‌ ప్లాట్‌ గజం ధర రూ.6 వేలుగా నిర్ణయించారు. కానీ వేలంలో ప్రభుత్వ ధరకు 3 రెట్లు పాడారు. అధికారులు గరిష్టంగా రెట్టింపు ధరకు ప్లాట్లు విక్రయించినా చాలనుకున్నారు. కానీ వేలంలో పాడుతున్న ధర చూసి నిర్వాహకులే అవాక్కవుతున్నారు.

రాజీవ్‌ స్వగృహ లబ్ధిదారుల్లో నిరాశ..
దాదాపు 15 ఏళ్ల క్రితమే సొంతిటి కల నెరవేర్చుకోవాలని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన రాజీవ్‌ స్వగృహ పథకం ద్వారా ఇల్లు కొనుగోలు చేయాని దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం రూ.5 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత వాయిదా పద్దతిలో నగదు చెల్లించే వెసులు బాటు కూడా నాటి ప్రభుత్వం కల్పించింది. దీంతో ప్లాట్ల కొనుగోలుకు చాలామంది ముందుకు వచ్చారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వైఎస్సార్‌ అకాల మరణం, తర్వాత జరిగిన పరిణామాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో రాజీవ్‌ స్వగృహ రద్దయింది. దీంతో రూ.5 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారు ఎన్నటికైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతుందా అని ఎదురు చూశారు. కానీ అంగారిక టౌన్‌షిప్‌ వేలంలో వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. అందరిలా రూ.10 వేల డీడ చెల్లించి వేలంలో పాల్గొనాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో డీడీలు కట్టి వేలంలో పాల్గొనేందుకు వచ్చారు. కానీ వేలంలో రియల్టర్లు తిప్పుతున్న చక్రం చూసి, భారీగా పెంచుతున్న ధరలకు బెంబేలెత్తి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇక సామాన్యుడి పరిస్థితి భవిష్యత్‌లో ఇక జాగా కొనలేం అంటూ నిరాశగా వేలం నుంచి వెళ్లిపోతున్నారు.

Also Read:Maharashtra Political Crisis: శివసేనలో చీలిక.. సంక్షోభంలో ‘మహా’ సర్కార్‌..

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version