https://oktelugu.com/

Ram Charan In Salman Khan Movie: సల్మాన్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్

Ram Charan In Salman Khan Movie: టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఊపు ఏ స్థాయి లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..#RRR సినిమా అన్ని బాషలలో సంచలన విజయం సాధించడం తో రామ్ చరణ్ ఇప్పుడు కేవలం పాన్ ఇండియన్ స్టార్ గా మాత్రమే కాదు..పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించాడు..#RRR సినిమా OTT లో విడుదలైన తర్వాత రామ్ చరణ్ కి ఇతర దేశాల నుండి కూడా అద్భుతమైన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 21, 2022 / 03:07 PM IST

    Charan, Salman

    Follow us on

    Ram Charan In Salman Khan Movie: టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఊపు ఏ స్థాయి లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..#RRR సినిమా అన్ని బాషలలో సంచలన విజయం సాధించడం తో రామ్ చరణ్ ఇప్పుడు కేవలం పాన్ ఇండియన్ స్టార్ గా మాత్రమే కాదు..పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించాడు..#RRR సినిమా OTT లో విడుదలైన తర్వాత రామ్ చరణ్ కి ఇతర దేశాల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఎక్కడ చూసిన రామ్ చరణ్ నటనని పొగుడుతూ ఇతర దేశానికి చెందిన వాళ్ళు సోషల్ మీడియా లో ట్వీట్లు వేస్తున్నారు ..ఇక బాలీవుడ్ లో కూడా ఆయన క్రేజీ స్టార్ హీరో గా మారిపోయాడు..ఇది ఇలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియా లో లేటెస్ట్ గా వినిపిస్తున్న ఒక వార్త రామ్ చరణ్ అభిమానులకు పూనకాలు రప్పించేలా చేస్తుంది..అదేమిటి అంటే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరో గా విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో పూజ హెగ్డే హీరోయిన్ గా ‘కభీ ఈద్ కభీ దివాళీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకుంటుంది.

    Salman Khan

    Also Read: Balakrishna Love Story: ముస్లిం హీరోయిన్ ని ప్రేమించి పెళ్ళికి సిద్ధమైన బాలయ్య… మరి ఏం జరిగింది!

    ఈ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడట..సినిమా మధ్యలో వచ్చే ఒక పాటలో రామ్ చరణ్- సల్మాన్ ఖాన్ – వెంకటేష్ కలిసి డాన్స్ చేయబోతున్నారట..సల్మాన్ ఖాన్ కి మన టాలీవుడ్ లో రామ్ చరణ్ చాలా బాగా క్లోజ్ అనే సంగతి మన అందరికి తెలిసిందే..రామ్ చరణ్ ని సల్మాన్ ఖాన్ తన సొంత తమ్ముడిలాగా ట్రీట్ చేస్తాడు..రామ్ చరణ్ ముంబైలోకి అడుగుపెట్టినప్పుడల్లా సల్మాన్ ఖాన్ అతనికి గొప్ప ఆతిధ్యం ఇచ్చేవాడట..రామ్ చరణ్ మరియు సల్మాన్ ఖాన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించడానికి ఒప్పుకున్నాడు సల్మాన్ ఖాన్..అలాగే ఆచార్య సినిమా కోసం వేసిన సెట్స్ ని సల్మాన్ ఖాన్ తన ‘కభీ ఈద్ కభీ దివాళీ’ సినిమా కోసం అడగగానే మారు ఆలోచించకుండా ఇచ్చేసాడు రామ్ చరణ్..ఈ సెట్స్ వాడుతున్నందుకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట..ఇక ఇటీవలే మెగాస్టార్ తన చిరకాల మిత్రుడు కమల్ హాసన్ విక్రమ్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యినందుకు చిరంజీవి తన నివాసం కమల్ హాసన్ కి పెద్ద సక్సెస్ పార్టీ ఇచ్చాడు..ఈ పార్టీ కి సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యాడు..హైదరాబాద్ వచ్చిన తర్వాత సల్మాన్ ఖాన్ కి చిరు ఫామిలీ తో ఇంకా మంచి రిలేషన్ ఏర్పడింది..అందుకే సల్మాన్ ఖాన్ రిక్వెస్ట్ చెయ్యగానే ఆయన సినిమాలో గెస్ట్ రోల్ చెయ్యడానికి ఒప్పేసుకున్నాడు రామ్ చరణ్..ప్రస్తుతం ఈ వార్త ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను హాట్ టాపిక్ గా మారింది.

    Ram Charan, Salman Khan

    Also Read: Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా… నో చెప్పిన గోపాలకృష్ణ గాంధీ

    Tags