Akash Missile System: ఆయుధాలు.. యుద్ధ సామగ్రి, మిసైల్స్.. వీటి పేరు చెప్తే అమెరికా గుర్తుకు వచ్చేది. ఈ సందర్భాలలో రష్యా కూడా ఈ పాత్రను పోషించేది. ప్రపంచ దేశాలకు ఈ రెండు దేశాలు ఆయుధాలు సమకూర్చి భారీగా వెనకేసుకునేవి. అందువల్లే ఈ రెండు దేశాలు ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఎదిగాయి. మధ్యలో రష్యా రాజకీయ అస్థిరత వల్ల తన ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోయినప్పటికీ.. అమెరికా మాత్రం ఇప్పటికి ప్రపంచానికి పెద్దన్న మాదిరిగానే ఉంది. ఆయుధాలు.. క్షిపణులు.. యుద్ధ సామగ్రి తయారీలో అమెరికా ఇప్పటికీ ప్రథమ స్థానంలోనే కొనసాగుతోంది. ఇప్పుడు అమెరికా స్థాయిలోనే భారత్ ఆయుధాల తయారీలో కీలక పాత్ర పోషించడానికి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మిసైల్స్, ఇతర ఆయుధాలు తయారుచేస్తోంది.
ఇటీవల ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ మీద భారత్ ఎలాంటి దాడులు చేసిందో ప్రపంచం మొత్తం చూసింది. సొంత భూ భాగం మీద ఉండి పాకిస్తాన్ లోని టార్గెట్ల మీద భారత్ దాడులు చేసింది. ప్రాణ నష్టం లేకుండానే ఉగ్రవాదుల స్థావరాల మీద దాడులు చేసింది. వాస్తవానికి ఈ విషయాన్ని పాకిస్తాన్ బయటికి చెప్పుకోలేదు గాని.. విధ్వంసం ఒక రేంజ్ లో జరిగింది. ఉగ్రవాద శిబిరాలు మొత్తం నేల కూలిపోయాయి. ఉగ్రవాద శిబిరాలు నేల కూలిన తర్వాత పాకిస్తాన్ నుంచి ప్రతిదాడులు ఉంటాయని భారత్ అంచనా వేసింది. తక్కువ ఎత్తులో రాడార్ కంటికి కనిపించని స్థాయిలో పాకిస్తాన్ మనమీదికి డ్రోన్లను ప్రయోగించింది. మిస్సైల్స్, ఫైటర్ జెట్లను కూడా ఉపయోగించింది. వాటన్నింటినీ భారత్ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంది. సొంత శాటిలైట్ వ్యవస్థ ఉండడంతో అత్యంత కచ్చితంగా ఉగ్రవాద స్థావరాలను భారత్ గుర్తించి ధ్వంసం చేసింది..
Also Read: గుజరాత్ లో బ్రిడ్జీలు.. పేకమేడలు.. ఇది రెండో ప్రమాదం.. డబుల్ ఇంజిన్ సర్కార్ కు మరో అవమానం
ఎయిర్ డిఫెన్స్ విభాగంలో రష్యా అందించిన ఎస్ 400 ను సమర్థవంతంగా వినియోగించుకున్న భారత్.. ఆకాశ్ లాంటి సొంత క్షిపణి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. భారత్ తయారుచేసిన ఆకాష్ మిసైల్స్ అద్భుతంగా పనిచేసిన నేపథ్యంలో.. వాటిని కొనుగోలు చేయడానికి బ్రెజిల్ ఆసక్తి చూపిస్తోంది. ఆకాష్ 45 కిలోమీటర్ల దూరం వరకు వాయు మార్గంలో వచ్చే ఇతర దేశాల మిస్సైల్స్, యుద్ధ విమానాలను ధ్వంసం చేస్తుంది.. ఆకాష్ మీడియం రేంజ్ సర్ఫేజ్, టూ ఎయిర్ మిస్సైల్ సిస్టం లాగా పనిచేస్తుంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఆకాష్ పాకిస్తాన్ ప్రయోగించిన అనేక మిసైల్స్ ను ధ్వంసం చేసింది.. అందువల్లే ఆకాష్ మిస్సైల్స్ ను కొనుగోలు చేయడానికి బ్రెజిల్ ఆసక్తిని ప్రదర్శిస్తోంది.ఆకాష్ వైమానిక రక్షణ వ్యవస్థ లాగా పని చేస్తుంది.
ఇటీవల భారత్ గరుడ అనే ఫిరంగి వ్యవస్థను కూడా అభివృద్ధి చేసింది. వాటిని కొనుగోలు చేయడానికి బ్రెజిల్ ఆసక్తిని ప్రదర్శిస్తుంది. గరుడ ఫిరంగిని విమానం ద్వారా విడిచి పెట్టవచ్చు. దీనివల్ల కొన్ని నిమిషాల్లోనే టార్గెట్ ఏరియాలలో విధ్వంసం జరిగిపోతుంది. క్లిష్ట ప్రాంతాలలో కూడా గరుడ ఫిరంగులను మోహరించవచ్చు. దీనిని 360 డిగ్రీలలో ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. ఆల్ టెర్రయిన్ అనే వాహనం పై దీనిని అమర్చితే.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా తీసుకెళ్లవచ్చు.. దేశభద్రతను దృష్టిలో పెట్టుకొని దీనిని డిఆర్డిఓ డెవలప్ చేసింది. అయితే ఇందులో అనేక మార్పులు చేసి అత్యంత అధునాతనమైన ఫిరంగిగా మార్చింది.