Karnataka Election Results: కర్నాటక రాజకీయం హీట్ తగ్గడం లేదు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 13న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మెజార్టీ సర్వే సంస్థలు హంగ్ ఫలితాలనిచ్చాయి. ఏ పార్టీకి మెజార్టీ రాదని తేల్చేశాయి. అత్యధిక సీట్లు సాధించే పార్టీగా కాంగ్రెస్ నిలవనుందని.. ఆ తరువాత స్థానంలో బీజేపీ నిలవనుందని స్పష్టం చేశాయి. జేడీఎస్ పార్టీ కీరోల్ ప్లే చేస్తుందని తేల్చిచెప్పాయి. దీంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత అనుభవాల దృష్ట్యా జేడీఎస్ కానీ అధికారం చేజిక్కించుకుంటే.. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండనుంది. పరిణామాలు శరవేగంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా..
దాదాపు అన్ని సర్వే సంస్థలు దగ్గరగా ఉండే ఫలితాలు వెలువరించడం విశేషం. బీజేపీ 80 నుంచి 90 సీట్లు సాధించే చాన్స్ ఉంది. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్ కు లాభించింది. ఆ పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయడంతో 100 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను చాలా ఈజీగా దాటనుందని సర్వే సంస్థలు తేల్చేశాయి, రెండు పార్టీలు అటు..ఇటుగా ఉంటే మిగతా 25 నుంచి 30 స్థానాలను జేడీఎస్ కైవసం చేసుకోనుంది. అంటే అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు ఎవరికీ రావన్కన మాట. అప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు తప్పనిసరిగా జేడీఎస్ అవసరం ఏర్పడుతుంది. అందుకే జేడీఎస్ నేత కుమారస్వామి తాము కింగ్ మేకర్ కాదు కింగ్ లమని ప్రకటించారు. సీఎం అవుతానన్న ధీమా కనిపిస్తోంది.
కుల ప్రభావం..
రెండు ప్రధాన జాతీయ పార్టీలకు తట్టుకొని జేడీఎస్ నిలబడడానికి ప్రధాన కారణం కులం. కర్నాటకలో వక్కలింగ కులస్థులు ఏకపక్షంగా జేడీఎస్ కు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఆ సామాజికవర్గ ప్రభావం ఉన్నచోట్ల జేడీఎస్ గెలుపొందుతూ వస్తుంది. ఇప్పుడు జేడీఎస్ కు వస్తాయనుకుంటున్న సీట్లు కూడా ఆ కులం అధికంగా ఉన్ననియోజకవర్గాలే కావడం విశేషం. ప్రాంతీయ పార్టీగా జేడీఎస్ మనుగడలో ఉండడానికి వక్కలింగ సామాజికవర్గమేప్రధాన కారణం.
ఏపీ కుమారస్వామి పవన్..
అయితే కర్నాటక ఫలితాలు ఏపీ పై ప్రభావం చూపనున్నాయి. అదే విధంగా టీడీపీ కూడా డెబ్బై నుంచి ఎనభై తెచ్చుకుంటే ఆ మిగిలిన పాతిక సీట్లు జనసేన లాగేస్తే మాత్రం ఏపీ కుమారస్వామి పవన్ కళ్యాణే అవుతారు అని అంటున్నారు. అక్కడ వక్కలింగ సామాజికవర్గం స్థానంలో ఇక్కడ కాపులు ఎలాగూ ఉన్నారు. మొత్తానికైతే కర్నాటక ఫలితాలు ఏపీకి కొత్తదారిని చూపనున్నాయి.