HomeతెలంగాణWarangal: ఘోరం: ఎల్లుండి పెళ్లి.. ఇవాళ పెళ్లి కొడుకు మృతి

Warangal: ఘోరం: ఎల్లుండి పెళ్లి.. ఇవాళ పెళ్లి కొడుకు మృతి

Warangal: జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. విధి వైపరీత్యానికి ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. విధిరాత అంటుంటారు. మన తలరాత కూడా అదే. ఎప్పుడు ఏ సమయంలో ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. సరదాగా చేసుకుందామని అనుకున్నా కొన్ని పరిస్థితుల్లో సాధ్యం కాదు. విధి ఆడిన నాటకంలో మనం అందరం పాత్రధారులమే. ఎన్నో ఊహలు, మరెన్నో ఊసులు.. ఎల్లుండే పెళ్లి.. కానీ అంతలోనే పెళ్లికొడుకు అనంత లోకాలకు చేరడం ఇదంతా సినిమా కథనంలా ఉన్నా ఇది నిజమే.

తాజాగా వరంగల్ జిల్లా రామన్నపేటలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడె ఎక్కుతున్నాడు. తనకు జరగబోయే పెళ్లి గురించి ఎంతో ఆత్రుతగా ఉన్న పెళ్లికొడుకు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. జీవితంలో చేసుకునే మధురమైన ఘట్టం పెళ్లి. ఆ వేడుక ఆనందంగా చేసుకుందామని అతడు చేసిన ఆలోచనలు కల్లలయ్యాయి.

మూడు ముళ్లు ఏడడుగులు వేసి జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కాలని ఆశపడ్డాడు. కానీ విధి ఆడిన నాటకంలో శవమై మిగిలాడు. ఈ విషాద ఘటన చూసిన వారందరు రోదిస్తున్నారు. దేవరకొండ సాగర్ చారి వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. పెళ్లి పనుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

దీంతో బంధువులు రోదనలు మిన్నంటాయి. పెళ్లి చేసుకోవాల్సిన సమయంలో ఇలా జరగడంపై అందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బంధువులు ఇంటికి చేరుకున్నారు. పెళ్లి పనుల్లో తలమునకలై పోయారు. కానీ వరుడే దూరం కావడం వారిని బాధించింది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో అశుభ కార్యం జరుగుతోంది. విధి పగబడితే ఎలా ఉంటుందో ఈ ఘటనే ఉదాహరణ.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version