టోక్యో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో వెండి పతకం గెలిచిన మీరాబాయి చాను గొప్ప మనసు చాటుకుంది. తాను ఈ స్థాయికి చేరడానికి కారణమైన లారీ డ్రైవర్లను పిలిపించి వారికి భోజనం పెట్టి ఓ షర్ట్, మణిపురి కండువా అందజేసి తనలోని మానవత్వాన్ని చాటుకుంది. ఏకంగా 150 మంది లారీ డ్రైవర్లను పిలిపించి వారికి తోచిన విధంగా సాయం చేయడం కొసమెరుపు. తన ఎదుగుదలకు సాయం అందించిన వారిని ఇలా గౌరవించడంపై అందరిలో హర్షం వ్యక్తమవుతోంది.
మీరాబాయి చాను అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగించేంది. తనలోని ఆశలను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టాలు పడింది. రోజు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిక్షణ కేంద్రానికి వెళ్లడానికి చేతిలో చిల్లి గవ్వ ఉండేది కాదు. దీంతో వారి ఊరికి నడిచే ఇసుక లారీల్లో వెళ్లి వచ్చేది. రోజు వారిచ్చే లిఫ్ట్ తోనే తన ఆశయం నెరవేర్చుకునేందుకు శిక్షణ తీసుకుంది. అయినా వారిని మరిచిపోలేదు. వారు చేసిన సాయం ఎప్పటికి మరిచిపోలేనిదని కొనియాడుతూ సరైన రీతిలో వారికి గౌరవం ఇచ్చింది.
వారిని పిలిచి భోజనం పెట్టిన అనంతరం భావోద్వేగానికి గురైంది. కళ్ల వెంట ఆనంద బాష్పాలు కారాయి. తనలోని ప్రతిభను గుర్తించి తన ఎదుగుదలకు తోడ్పడినందుకు అందరికి రుణపడి ఉంటానని పేర్కొంది. తనకు మీరు సాయం చేయకపోతే తన ఆశయం కాస్త ఆదిలోనే ఉండిపోయేదని చెప్పింది. తనకు ఇంతటి ఘనత రావడానికి మీరే కారణమని ఏడుస్తూ తనలోని భావోద్వేగాన్ని బయటపెట్టింది.
Extraordinary gestures by @mirabai_chanu #MirabaiChanu as she conveys her gratitude to these wonderful #TruckDrivers!
In her difficult days, these sand carrying truck drivers used to give free transportation to Mira so that she could have training at 25 km away #spirts facility. pic.twitter.com/TRtASr8Pqx— Sonmoni Borah IAS (@sonmonib5) August 6, 2021