https://oktelugu.com/

హీటెక్కిన బెజవాడ పాలిటిక్స్‌..: దేవినేని ఉమా అరెస్ట్‌

బెజవాడ రాజకీయాలు సవాళ్లు.. ప్రతిసవాళ్ల మధ్య భగ్గుమంటున్నాయి. మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు.. మాజీ మంత్రి దేవినేని ఉమా సవాళ్ల మధ్య ఒక్కసారిగా వేడి రాజుకుంది. గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపడతానని.. దమ్ముంటే తనను టచ్ చేయాలని కొడాలి నానికి సవాల్ విసిరిన ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గొల్లపూడిలో ఉద్రిక్తత తలెత్తింది. అక్కడికి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 19, 2021 / 04:11 PM IST
    Follow us on


    బెజవాడ రాజకీయాలు సవాళ్లు.. ప్రతిసవాళ్ల మధ్య భగ్గుమంటున్నాయి. మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు.. మాజీ మంత్రి దేవినేని ఉమా సవాళ్ల మధ్య ఒక్కసారిగా వేడి రాజుకుంది. గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపడతానని.. దమ్ముంటే తనను టచ్ చేయాలని కొడాలి నానికి సవాల్ విసిరిన ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గొల్లపూడిలో ఉద్రిక్తత తలెత్తింది. అక్కడికి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

    Also Read: ఏపీ పంచాయతీ ఎన్నికల తీర్పు రిజర్వు

    ‘మీ బూతుల మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కూర్చుంటా అంటే ఎందుకంత భయం? టచ్ చేస్తామని సవాల్ చేసి ఒక్కడి కోసం వేలమంది పోలీసులను పంపిస్తావా? మీ ప్రభుత్వ నియంతృత్వ పాలనకు ప్రజలు భయపడరు. ప్రజాబలాన్ని అధికార దుర్వినియోగంతో అడ్డుకోలేరని తెలుసుకోండి జగన్’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసుల వీడియోను ఆయన షేర్ చేశారు.

    గొల్లపూడిలో సోమవారం జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. తన చేతిలోనో లేదంటే.. కృష్ణప్రసాద్‌, వల్లభనేని వంశీ చేతిలోనో దెబ్బలు తినక తప్పదని దేవినేని ఉమాను హెచ్చరించారు. ‘మైలవరం నియోజకవర్గం వచ్చి మాట్లాడుతున్నా. ఎప్పుడైనా ఇక్కడికి వస్తా. మీ చంద్రబాబు ఏం చేశారో? మా జగన్‌ ఏం చేశారో చెబుతా. మీ ఇంట్లో అయినా సరే.. చర్చకు నేను రెడీ’ అని ఉమాకు కొడాలి నాని సవాల్‌ విసిరారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇంటికొచ్చి బడితె పూజ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. మంత్రి మాటలకు దీటుగా స్పందించిన ఉమా.. దమ్ముంటే టచ్ చేయాలని సవాల్ విసిరారు.

    Also Read: ఈటల మాటలతో ఆ విషయంపై క్లారిటీ వచ్చినట్లే..!

    మరోవైపు.. పోలీసులు ఉమాను అరెస్టు చేసి తరలిస్తుండగా ఆ వాహనాన్ని ఈలప్రోలు వద్ద మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో మహిళలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేవినేనిని విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్