https://oktelugu.com/

ఈ లక్షణాలు ఉంటే కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకూడదా..?

కరోనా మహమ్మారికి చెక్ పెట్టే కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దేశంలో లక్షల సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా కొంతమందిలో మాత్రం స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇద్దరు చనిపోయారని పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో భారత్ బయోటెక్ కు చెందిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి భార‌త్‌ బ‌యోటెక్ మార్గదర్శకాలను విడుదల చేసింది. Also Read: కరోనా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 19, 2021 / 04:34 PM IST
    Follow us on

    కరోనా మహమ్మారికి చెక్ పెట్టే కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దేశంలో లక్షల సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా కొంతమందిలో మాత్రం స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇద్దరు చనిపోయారని పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో భారత్ బయోటెక్ కు చెందిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి భార‌త్‌ బ‌యోటెక్ మార్గదర్శకాలను విడుదల చేసింది.

    Also Read: కరోనా నుంచి కోలుకున్న వారికి షాక్.. ఎనిమిది మందిలో ఒకరు మృతి..?

    భారత్ బయోటెక్ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను అలర్జీతో బాధ పడుతున్న వాళ్లు, ఇమ్యూనిటీ పవర్ పై ప్రభావం చూపే మందులను వినియోగించే వాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు తీసుకోకూడదు. భారత్ బయోటెక్ తమ వెబ్ సైట్ లో వ్యాక్సిన్ తీసుకునే వారిలో అనుమానాలను తొలగించడానికి ఒక ఫ్యాక్ట్ షీట్ ను రూపొందించింది.

    Also Read: వాటి వ‌ల్లే క‌రోనా వ్యాప్తి.. వాస్తవాలు వెల్లడించిన చైనా శాస్త్రవేత్తలు..?

    బ్లడ్ థిన్నర్స్ ను వాడేవాళ్లు మరియు రక్తస్రావ లోపాలు ఉన్నవాళ్లు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకూడదు. ఇతర కంపెనీ వ్యాక్సిన్ ను తీసుకున్న వారు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తీసుకోకూడదు. పాలిచ్చే తల్లులు మరియు గర్భిణులు కూడా కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకూడదని భారత్ బయోటెక్ సూచించింది. జ్వరంతో బాధ పడేవాళ్లు సైతం కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకపోవడమే మంచిది.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    ప్రస్తుతం కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగా అత్యవసర వినియోగం కోసం కేంద్రం ఈ వ్యాక్సిన్ కు అనుమతులు ఇచ్చింది. దేశంలో ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశాయి.