Old Phone : కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొన్న వెంటనే పాత ఫోన్లను మూలకు పడేయడం చాలా మందికి అలవాటే. కానీ మీ పాత ఫోన్ ఇంకా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే కాస్త తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది. దాని టచ్, కెమెరా బాగా పనిచేస్తుంటే దానితో అనేక పనులు చేయవచ్చు. అమ్మే బాధ లేదు, పడేసిన టెన్షన్ లేదు. మీ పాత ఫోన్‌కు కొత్త లైఫ్ ఇచ్చే కొన్ని ఈజీ సింపుల్ టిప్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.
పాత ఫోన్‌ను సీసీటీవీ కెమెరాలా మార్చండి
మీ దగ్గర పాత ఫోన్ ఉండి దాని కెమెరా కనుక బాగా పనిచేస్తుంటే… దానిని హోమ్ సెక్యూరిటీ కెమెరాలా ఉపయోగించవచ్చు. దీనికి ఒక చిన్న ఫోన్ స్టాండ్, వై-ఫై కనెక్షన్ ఉంటే చాలు. తర్వాత ప్లే స్టోర్ నుండి Alfred, IP Webcam వంటి ఉచిత యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లు లైవ్ వీడియోను చూపించడమే కాకుండా, ఏదైనా కదలిక ఉంటే వెంటనే మీకు అలర్ట్ పంపిస్తాయి. మీరు మీ కొత్త ఫోన్ నుంచి ఎప్పుడైనా పాత ఫోన్ లైవ్ ఫుటేజ్‌ను చూడవచ్చు. మీరు ఆఫీస్‌లో లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు లేదా పెద్దవారు ఉంటే ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read : స్మార్ట్‌ఫోన్ స్లో అయిందా… వేగవంతం చేయడం ఎలా?
పిల్లల కోసం సురక్షితమైన లెర్నింగ్ డివైజ్‌గా
పిల్లలకు చదువుకోవడానికి, గేమ్స్ ఆడటానికి స్మార్ట్ డివైజ్ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కానీ ప్రతిసారీ వారికి మీ కొత్త ఫోన్ ఇవ్వడం రిస్క్‌తో కూడుకున్నది. అలాంటి సమయంలో పాత ఫోన్ ఇవ్వడమే సరైన పరిష్కారం. దానిని ఫ్యాక్టరీ రీసెట్ చేసి YouTube Kids, BYJU’S లేదా Khan Academy Kids వంటి విద్యా సంబంధిత యాప్‌లను మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలి. అలాగే పేరెంటల్ కంట్రోల్ ఆన్ చేయాలి. తద్వారా పిల్లలు తప్పుడు యాప్‌లు లేదా సైట్‌లకు వెళ్లకుండా ఉంటారు. కావాలంటే ఈ డివైజ్ కోసం ప్రత్యేకంగా ఒక కొత్త Gmail అకౌంట్ కూడా క్రియేట్ చేయవచ్చు.
మీ పాత ఫోన్‌ను మ్యూజిక్ స్టేషన్‌గా మార్చండి
మీకు పాటలు అంటే ఇష్టం అయితే వాటిని వినడానికి పాత ఫోన్ మీ మ్యూజిక్ మెషీన్‌గా మారగలదు. Spotify, Gaana లేదా JioSaavn వంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసి ఇష్టమైన పాటలను డౌన్‌లోడ్ చేసి ఉంచుకోవచ్చు. తర్వాత దానిని బ్లూటూత్ స్పీకర్‌కు కనెక్ట్ చేసి, కాల్స్ అంతరాయం లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. మీరు కావాలంటే కారులో కూడా ఈ ఫోన్‌ను అమర్చుకోవచ్చు. డ్రైవ్ చేసేటప్పుడు మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. కొన్ని యాప్‌ల సహాయంతో దేశ విదేశాల ఎఫ్ఎం స్టేషన్‌లను కూడా వినవచ్చు.
Also Read: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు మరో పరీక్ష.. అలా చేస్తేనే కొలువు
చిన్న ప్రయత్నం, పెద్ద లాభం
పాత ఫోన్‌కు సరికొత్త జీవితాన్ని ఇవ్వడానికి పెద్దగా టెక్నాలజీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం సెట్టింగ్స్, కొన్ని ఈజీయాప్‌లు,కొంచెం క్రియేటివ్ ఆలోచన ఉంటే చాలు. ఒకప్పుడు స్పెషల్ గా ఉన్న ఫోన్ ఇప్పుడు నయా లుక్ లో మీకు సాయంగా ఉంటుంది.