Homeట్రెండింగ్ న్యూస్Dr Ganesh Rakh: భాష్ డాక్టర్ సాబ్.. ఆడపిల్ల పుడితే ఉచితంగా ఆపరేషన్.. కేక్ కట్...

భాష్ డాక్టర్ సాబ్.. ఆడపిల్ల పుడితే ఉచితంగా ఆపరేషన్.. కేక్ కట్ చేసి, స్వీట్లు

Dr Ganesh Rakh: లింగ సమానత్వం లేకపోవడం వల్ల సమాజంలో ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. అందువల్లే చాలామంది మగ పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఆడపిల్లలు దొరకపోవడంతో మగపిల్లలు పెళ్ళికాని ప్రసాద్ లు మాదిరిగా మిగిలిపోతున్నారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే కన్యాశుల్కం అందుబాటులోకి వచ్చింది. వెనుకటి కాలంలో కన్యాదానం చేసేవారు. ఇప్పుడు ఆడపిల్లలు అందుబాటులో లేకపోవడంతో కన్యాశుల్కం చేస్తున్నారు. ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతున్నప్పటికీ.. సమాజంలో అన్ని రంగాలలో ఆడపిల్లలు దూసుకుపోతున్నప్పటికీ.. ఇప్పటికీ ఆడపిల్లలపై సమాజంలో వివక్ష కొనసాగుతూనే ఉంది.. “ఆడపిల్లేనా” అనే ఈసడింపు కొనసాగుతూనే ఉంది. పరిస్థితి కారణంగా ఉన్నప్పటికీ గర్భ విచ్చిత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. గర్భంలో ఆడ శిశువును నులిపి వేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఇలాంటి చర్యలు దారుణమని తెలిసినప్పటికీ.. కొంతమంది వైద్యుల వల్ల ఇలాంటి నిర్వాకాలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఓ వైద్యుడు మాత్రం ఆడపిల్లల పాలిట దేవుడిలాగా అవతరించాడు. అంతేకాదు వారి ప్రాణాలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు.

Also Read: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పీవోకేను అప్రమత్తం చేసిన పాకిస్థాన్‌!

స్వీట్లు పంచి.. కేక్ కట్ చేస్తాడు

పూణే ప్రాంతంలోని డాక్టర్ గణేష్ రఖ్ అనే వైద్యుడు ఉన్నాడు. ఈయనకు సొంతంగా ఆస్పత్రి ఉంది. ఆసుపత్రికి ప్రసవం నిమిత్తం ఎవరైనా గర్భిణీ వస్తే.. ఆమెకు చేసిన ఆపరేషన్ లో ఆడపిల్ల పుడితే.. గణేష్ ముఖంలో ఎక్కడా లేని ఆనందం కనిపిస్తుంది. అంతేకాదు ఆ ఆనందాన్ని సరికొత్త విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. కేక్ తీసుకొస్తాడు.. ఆ ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లితో కట్ చేయిస్తాడు. స్వీట్లు తీసుకొచ్చి ఆసుపత్రి మొత్తం పంచుతాడు. అంతేకాదు ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు గానూ.. ఉచితంగానే ఆపరేషన్ చేస్తాడు.. ఇలా 2012 నుంచి ఇప్పటివరకు దాదాపు డాక్టర్ గణేష్ రెండు వేల ఆపరేషన్లు ఉచితంగా చేశాడు. దాదాపు 2000 మంది ఆడపిల్లలకు అతడు ప్రాణదాతగా నిలిచాడు.. ఆడపిల్ల అంటే విపరీతమైన హేయమైన భావన కొనసాగుతున్న ఈ కాలంలో.. ఇలాంటి వైద్యుడు ఉండడం నిజంగా గొప్ప విషయమే.. అన్నట్టు ఆడపిల్ల పుడితే ఉచితంగా ఆపరేషన్ కూడా చేయడం అభినందించదగ్గ పరిణామమే.” అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమానమే. ప్రతి అమ్మాయి కూడా ఈ భూమి మీద పుట్టడానికి.. పెరగడానికి.. ఎదగడానికి అర్హురాలు. ప్రతి వేడుకను ఘనంగా జరుపుకోవడానికి ఆమె అర్హురాలు. ఈ సందర్భంలోనూ ఆడపిల్ల అంటే చిన్న చూపు వద్దు. నిర్లక్ష్యం అసలు వద్దు. ఆమె అభివృద్ధి చెందుతుంటే చూడాలి. ఎందుకంటే ఆడపిల్ల వల్లే సమాజం బాగుపడుతుంది. సమాజం అంతకంతకు విస్తరిస్తుంది. ఆడపిల్లల్ని పుట్టనీయకపోవడం వల్ల సమాజం ఏమాత్రం బాగుపడదు.. అందువల్ల ఆడపిల్లకు స్వేచ్ఛ ఇవ్వాలి.. అన్నింటికీ మించి ఆమెను పుట్టనివ్వాలి. ఎదగనివ్వాలి.. అభివృద్ధి చెందే అవకాశం ఇవ్వాలని” గణేష్ చెబుతుంటారు.

Also Read: అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో దక్షిణ అమెరికా అప్రమత్తం

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular