తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్స్ యజమానులు సోమవారం నుంచి సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రమంతటా ఆయిల్ ట్యాంకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైనే నిలిచిపోయాయి. ఆయిల్ ట్యాంకర్ల యజమానులకు ఆయిల్ సంస్థలు అందించే రవాణా ఛార్జీల్లో 80శాతం కోత విధించాయి. దీనిని నిరసిస్తూ ఆయిల్ ట్యాంకర్ల ఓనర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు.
ఆయిల్ ట్యాంకర్ల సమ్మెతో ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డిజీల్ సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. కాగా నేటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల అనుమతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనేపథ్యంలో పెట్రోల్, డీజిల్ అవసరాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. తాజాగా ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో చాలా ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అయితే ఆయిల్ ట్యాంకర్ల డిమాండ్లను ఆయిల్ సంస్థలు పట్టించుకోకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని అసోసియేషన్ నేతలు అంటున్నారు. దీనిపై ఆయిల్ సంస్థలు ఏవిధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే..!