https://oktelugu.com/

సిర్పూర్ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్.. తప్పిన పెనూ ప్రమాదం

తెలంగాణలోని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు ఉంది. ఇటీవల కేంద్రం కొన్ని పరిశ్రమలకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో పేపర్ మిల్లును ప్రారంభించేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేపట్టింది. ఈనేపథ్యంలోనే కార్మికులు సోమవారం ఉదయం పేపర్ మిల్లులో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీకైంది. ఈ సంఘటనలో ఓ కార్మికుడు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం రహస్యంగా ఉంచింది. కార్మికుడి కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించడంతో ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 11, 2020 / 01:30 PM IST
    Follow us on

    తెలంగాణలోని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు ఉంది. ఇటీవల కేంద్రం కొన్ని పరిశ్రమలకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో పేపర్ మిల్లును ప్రారంభించేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేపట్టింది. ఈనేపథ్యంలోనే కార్మికులు సోమవారం ఉదయం పేపర్ మిల్లులో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీకైంది. ఈ సంఘటనలో ఓ కార్మికుడు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం రహస్యంగా ఉంచింది. కార్మికుడి కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించడంతో ఈ విషయం వెలుగు చూసింది.

    పేపర్ మిల్లును ప్రారంభించే సమయంలో 20మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గ్యాస్ లీకేజీ గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న అధికారులకు పేపర్ మిల్లును సందర్శించి లీకేజీ గల కారణాలు తెలుసుకుంటున్నారు. లీకేజీ వల్ల ఎలాంటి నష్టం జరిగిందనే కోణంలో విచారిస్తున్నారు. అయితే గతంలోనూ ఈ పేపర్ మిల్లులో పలుమార్లు ప్రమాదా చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయని కార్మికులు అంటున్నారు. ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు అధికారులను కోరారు. ఇటీవలే ఏపీలోని విశాఖ పట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ మరువకముందే తెలంగాణలోని సిర్పూర్ పేపర్ మిల్లులో గ్యాస్ లీకేజీ ఘటన ప్రజలను భయాందోళనకు గురిచేసింది.