
మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో చమురు వెలికితీత పని ప్రారంభమైంది. ఏకంగా 6 కి.మీల లోతులోని చమురును వెలికితీసే కాంట్రాక్టులో మన తెలుగు సంస్థ భాగస్వామ్యమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలోనే తొలిసారిగా డ్రిల్లింగ్ రిగ్గును రూపొందించి తెలుగు వారి సంస్థ మేఘా ఇంజనీరింగ్ అద్భుతం సృష్టించింది.. ఇంజనీరింగ్ రంగంలోనే ఇంతటి భారీ డ్రిల్లింగ్ రిగ్గు మరొకటి లేకపోవడం గమనార్హం. త్వరలోనే ఓన్.జి.సి.కి మరో 47 రిగ్గులను సరఫరా చేయనుంది. చమురు బావులను డ్రిల్ చేయడం ద్వారా రాబోయే కాలంలో ఆధునిక టెక్నాలజీ సహాయంతో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ భారీ డ్రిల్లింగ్ రిగ్గును మేఘా సంస్థ తయారు చేసింది.
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ సంస్థ (ఎంఈఐఎల్) తాజాగా మరో అరుదైన సాంకేతికతను సొంతం చేసుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి డ్రిల్లింగ్ రిగ్గును మేఘా సంస్థ తయారు చేసింది. డ్రిల్లింగ్ రిగ్గు సామర్థ్యం 1500 హెచ్.పి కావడం విశేషం. ఇది భూ ఉపరితలం నుండి 6000 మీటర్ల లోతు వరకు తవ్వగలదు 6 కి.మీలు భూమిలోపల తవ్వడం ద్వారా చమురును వెలికితీయవచ్చు. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన పథకం మేకిన్ ఇండియాలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ డ్రిల్లింగ్ రిగ్గును తయారు చేసింది.
అహ్మదాబాద్ లో ఓ.ఎన్.జి.సి కి సంబంధించిన కల్లోల్ కెఎల్.డి.డి.ఎక్స్ చమురు క్షేత్రంలో ఈ గురువారం నుంచే పని ప్రారంభించింది మేఘా సంస్థ. 1500 హెచ్ పి సామర్థ్యంతో తయారు చేసిన ఈ డ్రిల్లింగ్ రిగ్గు భూ ఉపరితలం నుంచి 6000 మీటర్ల లోతు వరకు చమురు బావులను సులువుగా తవ్వగలదు. ఈ రిగ్గు 40 సంవత్సరాల పాటు మన్నికగా పనిచేస్తుంది. ఓన్.జి.సి.కి సంబంధించిన 47 రిగ్గులలో భాగంగా తొలి రిగ్గును మేఘా సంస్థ నేడు అహ్మదాబాద్ చమురు క్షేత్రంలో ఉపయోగిస్తోంది.ప్రస్తుతం ఈ డ్రిల్లింగ్ రిగ్గులు ఓఎన్జీసి అహ్మదాబాద్ ఆయిల్, గ్యాస్ క్షేత్రంలో మేఘా ఉపయోగిస్తోంది. ఈ రిగ్గును ఓఎన్ జిసికి సంబంధించిన అహ్మదాబాద్ చమురు క్షేత్రంలో ఉపయోగిస్తున్నారు. అహ్మదాబాద్ లో ఉన్న కల్లోల్ క్షేత్రంలో ఉన్న చమురు బావి కెఎల్.డి.డి.ఎక్స్ ను ప్రస్తుతం తవ్వుతున్నారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని మేఘా ఇంజనీరింగ్ సంస్థ భారతదేశంలో, ఇటలీ దేశాలలో తయారు చేస్తోంది. 2019లో ఓఎన్ జీసి నుండి 47 డ్రిల్లింగ్ రిగ్గుల సప్లై ఆర్డర్ ను పొందిన మేఘా అనతికాలంలోనే వీటిని అందజేయడం విశేషం. మొత్తం 47 డ్రిల్లింగ్ రిగ్గులను ఓన్ జిసి కి సరఫరా చేయనున్నది. ఇందులో 20 వర్క్వోవర్ రిగ్గులు, 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు ఉన్నారు. 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులలో రెండు 1500 హెచ్ పి మోబైల్ హైడ్రాలిక్ రిగ్గులు కావడం విశేషం. ఇందులో17 మాత్రం 1500 హెచ్ పి ఏసి వీఎఫ్ డి రిగ్గులు మిగతా ఆరు 2000 హెచ్.పి. ఏసి వీఎఫ్ డి రిగ్గులు ఉన్నాయి. వీటిని భారతదేశం, ఇటలీలలో గల మేఘా సంస్థ తయారు చేస్తోంది.