https://oktelugu.com/

ఆ నలుగురినీ కాదని త్రివిక్రమ్‌కే వెంకీ ఓటు!

టాలీవుడ్‌లో మల్టీస్టారర్లకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన విక్టరీ వెంకటేశ్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి ‘ఎఫ్‌2, తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’తో వెంటవెంటనే రెండు ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘నారప్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ్‌ సూపర్ హిట్‌ మూవీ ‘అసురన్‌’కు రీమేక్‌ ఇది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వి క్రియేషన్స్ బ్యానర్ల కింద దగ్గుబాటి సురేశ్ బాబు, కలైపులి థాను ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌ […]

Written By:
  • admin
  • , Updated On : August 21, 2020 / 08:22 PM IST
    Follow us on


    టాలీవుడ్‌లో మల్టీస్టారర్లకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన విక్టరీ వెంకటేశ్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి ‘ఎఫ్‌2, తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’తో వెంటవెంటనే రెండు ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘నారప్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ్‌ సూపర్ హిట్‌ మూవీ ‘అసురన్‌’కు రీమేక్‌ ఇది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వి క్రియేషన్స్ బ్యానర్ల కింద దగ్గుబాటి సురేశ్ బాబు, కలైపులి థాను ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు నేటివిటీ ప్రకారం కథలో కొన్ని మార్పులు చేశారు. చిత్తురు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే నారప్పలో వెంకీ భార్య పాత్రను ప్రియమణి పోషిస్తోంది. వెంకీకి ఇది 74 చిత్రం. ఇప్పటికే షూటింగ్‌ మొదలవగా కరోనా రాకతో దానికి బ్రేక్‌ పడింది.

    Also Read: తెలుగు మూవీలో కాల్‌ గర్ల్‌గా బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ!

    దాదాపు ఐదు నెలలుగా షూటింగ్‌కు విరామం రావడంతో తదుపరి సినిమాపై వెంకీ దృష్టి పెట్టాడు. వచ్చే సినిమా తన 75వ చిత్రం కావడంతో దాన్ని ప్రతేక్యంగా మార్చుకోవాలని చూస్తున్నాడు. తన మైల్‌ స్టోన్‌ మూవీకి తగ్గ కథ కోసం అన్వేషణలో పడ్డాడు. ఈ క్రమంలో పలువురు టాప్‌ డైరెక్టర్లతో వెంకీ సంప్రదింపులు జరిపాడు. ఆ లిస్ట్‌లో పూరి జగన్నాథ్‌, కిషోర్ తిరుమల, త్రినాథ రావు నక్కిన, తరుణ్‌ భాస్కర్ పేర్లు వినిపించాయి. ఈ నలుగురూ వెంకీ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే పాయింట్‌తో కథలు సిద్ధం చేశారట. కానీ, ఇవేవీ వెంకటేశ్‌కు నచ్చలేదట. దాంతో, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను లైన్లో పెట్టాడని సమాచారం. వెంకీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్లో సినిమా వస్తోందంటూ ఎప్పటి నుంచో వార్తలొచ్చాయి. కానీ, ఇన్నాళ్లకు వారిద్దరి ప్రాజెక్ట్‌ సెట్‌ అయిందట. అది వెంకీ మైల్‌స్టోన్‌ 75వ చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపవుతోంది. త్రివిక్రమ్‌ ఇప్పటికే కథ రెడీ చేసి వెంకీకి వినిపించగా అతను వెంటనే ఓకే చెప్పాడట.

    Also Read: నానికి షాక్‌.. రిలీజ్‌కు ముందే ‘వి’ కథ లీక్‌!

    ‘అల వైకుంఠపురములో’తో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టిన త్రివిక్రమ్‌ తన తదుపరి సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సి ఉంది. దీనికి ‘అయిననూ పోయిరావాలె హస్తినకు’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన వెంటనే దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావించాడు త్రివిక్రమ్‌. కానీ, కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ వాయిదా పడింది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. కాబట్టి ఎన్టీఆర్ తో మూవీ ఆలస్యమయ్యేలా ఉంది. దాంతో, ఈ విరామంలో వెంకీతో సినిమా చేయాలని త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. దీనిపై తొందర్లోనే ప్రకటన వచ్చే చాన్సుంది. పూరి సహా నలుగురు డైరెక్టర్లను కాదని మరీ వెంకీ… త్రివిక్రమ్‌కు ఓకే చెప్పాడంటే ఈ సినిమా కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.