https://oktelugu.com/

ఏపీలో దారుణం.. మహిళా ఉద్యోగిపై అధికారి దాడి…

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా కాంట్రాక్టు ఉద్యోగిని పై గవర్నమెంట్ అధికారి దాడి చేశారు. సి సి టీవీలో రికార్డు అయిన ఆ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుర్చీలో కూర్చొని ఉన్న ఆ మహిళపై సదరు అధికారి పాశవికంగా దాడి చేశారు. ఆ మహిళ జుట్టు పట్టుకొని చేతికి దొరికిన వస్తువులు తీసుకొని గాయపరచడం సి సి టీవీలో స్పష్టంగా రికార్డు అయ్యింది. ఇక ఆమెపై ఆ అధికారి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 30, 2020 / 12:52 PM IST
    Follow us on


    నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా కాంట్రాక్టు ఉద్యోగిని పై గవర్నమెంట్ అధికారి దాడి చేశారు. సి సి టీవీలో రికార్డు అయిన ఆ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుర్చీలో కూర్చొని ఉన్న ఆ మహిళపై సదరు అధికారి పాశవికంగా దాడి చేశారు. ఆ మహిళ జుట్టు పట్టుకొని చేతికి దొరికిన వస్తువులు తీసుకొని గాయపరచడం సి సి టీవీలో స్పష్టంగా రికార్డు అయ్యింది. ఇక ఆమెపై ఆ అధికారి దాడి చేయడానికి కారణం, అతనికి సామాజిక బాధ్యత గుర్తు చేయడమే అని తెలుస్తుంది. ఫేస్ మాస్క్ లేకుండా ఆఫీస్ కి వచ్చిన ఆ అధికారిని, ఆ మహిళా ఉద్యోగి ప్రశ్నించగా..ఆయన కోపంతో ఊగిపోతూ ఆమె పై దాడి చేశారు.

    బతికుంటే బలుసాకు తిందాం.. ఇంటికి పోదాం!

    ఆఫీస్ లోని మిగతా ఉద్యోగులు వారించడడంతో పాటు ఆమెను దాడి నుండి కాపాడే ప్రయత్నం చేశారు. హఠాత్పరిణామంతో ఆ మహిళ దిగ్బ్రాంతికి గురయ్యారు. నెల్లూరు ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుండగా… అది ఏ విభాగం, ఆ అధికారి ఎవరు అనే పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఎన్ని చట్టాలు తెచ్చినా ఆడవారికి రక్షణ లేదని తాజా ఉదంతం గుర్తు చేసింది. ప్రభుత్వ కార్యాలయంలోనే ఓ మహిళపై అందరూ చూస్తుండగా దాడి జరగడం విస్మయానికి గురిచేసింది. దీనిపై సామాజిక వేత్తలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. జూన్ 27వ తేదీన ఈ సంఘట జరిగినట్టు తెలుస్తుండగా…సి సి టీవీ ఫుటేజ్ బయటకి రావడంతో సంఘటన వెలుగు చూసింది.

    తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

    ఇప్పటికే సదరు అధికారిపై చర్యలకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆయనపై దిశ చట్టం క్రింద కేసు నమోదయ్యే అవకాశం కలదు. సోషల్ మాధ్యమాలలో ఈ వీడియో వైరల్ అవుతుండగా అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు సైతం ఈ సంఘటనపై గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే సూచనలు కనిపిస్తున్నాయి. అమానుషమైన ఈ ఘటన రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీయడం ఖాయం.