సినీ పరిశ్రమలో భయం..భయం..

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందల కోట్లకు తెలుగు సినిమా పరిశ్రమ ఎదిగినప్పుడు అందరం సంతోషం పడ్డాం. బాహుబలి లాంటి తెలుగు చిత్రం ప్రపంచమంతా ఆడి 2వేల కోట్లు కొల్లగొట్టినప్పుడు తెలుగువారంతా గర్వపడ్డారు. కానీ ఇప్పుడు సినీ పరిశ్రమ కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న రంగం ఏదైనా ఉందంటే అందులో మొదటిది తెలుగు సినిమా పరిశ్రమ. బాహుబలితో తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి దేశవ్యాప్తం, […]

Written By: NARESH, Updated On : June 30, 2020 1:03 pm
Follow us on


ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందల కోట్లకు తెలుగు సినిమా పరిశ్రమ ఎదిగినప్పుడు అందరం సంతోషం పడ్డాం. బాహుబలి లాంటి తెలుగు చిత్రం ప్రపంచమంతా ఆడి 2వేల కోట్లు కొల్లగొట్టినప్పుడు తెలుగువారంతా గర్వపడ్డారు. కానీ ఇప్పుడు సినీ పరిశ్రమ కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న రంగం ఏదైనా ఉందంటే అందులో మొదటిది తెలుగు సినిమా పరిశ్రమ.

బాహుబలితో తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి దేశవ్యాప్తం, విశ్వవ్యాప్తమైంది. తెలుగు కథలకు డిమాండ్ పెరిగింది. మన హీరోల మార్కెట్ విస్తృతమైంది. ప్యాన్ ఇండియా స్టార్లుగా మారారు. 200 కోట్ల క్లబ్ లో చేరారు. దీంతో కోట్లుగా వచ్చిన డబ్బును చాలా మంది హీరోలు థియేటర్లపై పెట్టారు. ఇప్పుడు అదే వారిని చేతులు కాల్చుకునేలా చేస్తోంది.

ఏపీలో దారుణం.. మహిళా ఉద్యోగిపై అధికారి దాడి..

అవును ప్రభాస్ అప్పట్లో నెల్లూరు జిల్లాలో అతిపెద్ద భారీ థియేటర్ కట్టి ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు.. యూవీ క్రియేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్ ను కొని బిజినెస్ చేస్తోంది. మహేష్ బాబు కూడా ఎంబీ థియేటర్స్ పేరుతో థియేటర్స్ వ్యాపారంలోకి దిగాడు. వీరిద్దరే కాదు.. మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్, దిల్ రాజ్, సురేష్ ప్రొడక్షన్స్ ఇలా అందరు నిర్మాతల చేతిల్లో థియేటర్స్ ఉన్నాయి.

కానీ ఇప్పుడు ఆ థియేటర్స్ లో పురుగు కూడా లేదు. భవిష్యత్ లో జనాలు వస్తారన్న గ్యారెంటీ లేదు. మూడు నెలలు దాటింది. కరోనా భయంతో థియేటర్స్ మూతపడ్డాయి. కరోనా తగ్గితేనే జనాలు థియేటర్స్ కు వస్తారు. అది ఇప్పట్లో తగ్గేలా లేదు. పెరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదు. అందుకే అందరికంటే ఎక్కువ భయాలు సినీ పరిశ్రమలో ఉన్నాయి..

కేసీఆర్ కు కరోనా మరక.. వదిలేలా లేదుగా?

టాలీవుడ్ లోనే తెలివైన బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. అసలు ఈ కరోనా పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్ లో సినిమా నిర్మిస్తామో లేదో అన్న భయాందోళనలు కలుగుతున్నాయని.. దీన్ని ఎప్పుడు బయటపడుతామో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. దీన్ని బట్టి సినిమా పరిశ్రమలో బడా నిర్మాతలే వణుకుతున్న పరిస్థితి నెలకొంది.

కరోనా చేతుల్లో సినీ పరిశ్రమ చిక్కుకుంది. కుదేలవుతోంది. కోట్లు పెట్టుబడిగా పెట్టిన తారలు, సినీ నిర్మాతలు ఇప్పుడు వణుకుతున్నారు. భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. అందరూ బయటపడుతారనే నమ్మకం ధైర్యం ఉన్నా.. సామూహికంగా సినిమాలు చూసే థియేటర్స్ కు జనం కరోనా భయంతో వస్తారా? సినీ పరిశ్రమ మునుపటిలా నడుస్తుందా అన్న భయాలు సినీ రంగాన్ని వెంటాడుతున్నాయి..

-ఎన్నం