దేశంలో అతిపెద్ద కరోనా ఆసుప్రతి ఎక్కడో తెలుసా?

కరోనా(కోవిడ్-19) పేరు చెబితినే ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్ పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా అన్ని దేశాలకు పాకింది. భారత్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో దేశమంతటా 21రోజులపాటు లాకౌడౌన్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే. కరోనా నియంత్రణ కోసం కేంద్రం తీసుకునే అన్ని చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగా దేశంలో కరోనా బాధితుల కోసం ప్రత్యేక ఆసుప్రతి ఏర్పాటు చేస్తున్నారు. కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు చైనా కేవలం పది […]

Written By: Neelambaram, Updated On : March 26, 2020 7:10 pm
Follow us on

కరోనా(కోవిడ్-19) పేరు చెబితినే ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్ పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా అన్ని దేశాలకు పాకింది. భారత్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో దేశమంతటా 21రోజులపాటు లాకౌడౌన్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే. కరోనా నియంత్రణ కోసం కేంద్రం తీసుకునే అన్ని చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగా దేశంలో కరోనా బాధితుల కోసం ప్రత్యేక ఆసుప్రతి ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు చైనా కేవలం పది రోజుల్లోనే 1000పడకల ఆసుప్రతి నిర్మించిన సంగతి తెల్సిందే. ఈ తరహాలోనే భారత్ లోనూ ప్రత్యేక ఆసుపత్రి నిర్మించేందుకు కేంద్రం పూనుకుంది. ఒడిశాలో అతిపెద్ద కరోనా(కోవిడ్-19) ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. వెయ్యి పడకలతో కూడిన ఓ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. దేశంలోనే కరోనా కోసం ప్రత్యేకంగా ఆసుప్రతి ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఇందులో కరోనా బాధితులకు ప్రత్యేకమైన చికిత్స అందిస్తున్నారు.

అన్ని రాష్ట్రాలు ఒడిశాను ఆదర్శంగా తీసుకోవాలిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు. ఒడిశా తరహాలోనే మరిన్ని రాష్ట్రాలు ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేసే దిశగా సన్నహాలు చేస్తున్నట్లు తెల్సింది.