కరోనా సోకిన ఎమ్మెల్యేపై కేసు నమోదు.. ఎందుకంటే..?

కరోనా వైరస్ సోకిన ఒక ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. కరోనా సోకిన ఎమ్మెల్యే చేసిన ఒక చిన్న తప్పు ఆయన జైలుపాలు కావడానికి కారణమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నా చాలామంది ప్రజలు,రాజకీయ నేతలు నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. ఒడిశాలోని పూరీలో ఎమ్మెల్యే ఉమాకంఠ కరోనా బారిన పడ్డారు. అయితే వైరస్ సోకినా అతనిలో కరోనా లక్షణాలు తక్కువగానే కనిపించాయి. వైద్యులు ఉమాకంఠకు రెండు వారాలు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచనలు చేశారు. […]

Written By: Navya, Updated On : October 10, 2020 9:27 pm
Follow us on

కరోనా వైరస్ సోకిన ఒక ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. కరోనా సోకిన ఎమ్మెల్యే చేసిన ఒక చిన్న తప్పు ఆయన జైలుపాలు కావడానికి కారణమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నా చాలామంది ప్రజలు,రాజకీయ నేతలు నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. ఒడిశాలోని పూరీలో ఎమ్మెల్యే ఉమాకంఠ కరోనా బారిన పడ్డారు. అయితే వైరస్ సోకినా అతనిలో కరోనా లక్షణాలు తక్కువగానే కనిపించాయి.

వైద్యులు ఉమాకంఠకు రెండు వారాలు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచనలు చేశారు. అయితే అదే సమయంలో ప్రదీప్‌ మహారాతి అనే నేత గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ మృతి చెందారు. కరోనా నిబంధనల నేపథ్యంలో ప్రదీప్ మహారాతి అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో బంధువులకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే కరోనా సోకినా ఎమ్మెల్యే ఉమాకంఠ ప్రదీప్ అంత్యక్రియలకు హాజరయ్యారు.

విషయం పోలీసులకు తెలియడం, కరోనా సోకిన ఎమ్మెల్యే అంత్యక్రియలకు హాజరు కావడంపై విమర్శలు వ్యక్తం కావడంతో అంటువ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారం ఉమా కంఠపై కేసు నమోదైంది. అయితే బీజూ జనతాదళ్ పార్టీకి చెందిన నేతపై కేసు నమోదు చేయడంపై ఆ పార్టీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే తమ పార్టీకి చెందిన నేతపై కేసు నమోదు చేశారని వాళ్లు ఆరోపణలు చేస్తున్నారు.

ఇతర పార్టీల నేతలు నిబంధనలను పట్టించుకోకుండా ఫంక్షన్లు నిర్వహిస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తమ పార్టీకి చెందిన నేతల విషయంలో మాత్రం అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్థానిక లోక్‌ సభ సభ్యురాలు అపరాజిత షడంగి కరోనా నిబంధనలు పాటించకుండా భారీ సమూహంతో వినోద కార్యక్రమం నిర్వహించిందని బీజూ జనతాదళ్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.