
NZ PM Jacinda Ardern: కరోనా వైరస్ కట్టడిలో న్యూజిలాండ్ విజయం సాధించింది. దేశంలో మహమ్మారిని తుదముట్టించే క్రమంలో పటిష్ట చర్యలు తీసుకుంటోంది. దీంతో దేశం మొత్తం కరోనా రహిత దేశంగా ముందుకు వెళుతోంది. ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కరోనా నిర్మూలనలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ప్రధాని ఓ ఇంటర్వ్యూుకు హాజరవగా ఆమెకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఎవరు ఊహించని ప్రశ్న రావడంతో ఆమె ఆశ్చర్యపోయింది.
ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆప్లే బ్లూమ్ ఫీల్డ్ తో కలిసి ఇటీవల ఆమె ఓ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఓ మహిళా విలేకరి అడిగిన ప్రశ్నకు అవాక్కయ్యారు. అక్లాండ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితుడిని పరామర్శించేందుకు వచ్చిన ఓ మహిళ శృంగారంలో పాల్గొందని వార్తలొచ్చాయి. ఆ ప్రశ్న విన్న వెంటనే ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ఆమె విలేకరి కూడా ఊహించని సమాధానం చెప్పడంతో ఆమె నోరు మూసుకున్నారు.
కరోనా పరిస్థితుల్లోనే కాదు మామూలు సమయాల్లో కూడా ఇలాంటి పనులు చేయకూడదని సూచించారు. దీంతో ఆమె విస్తుపోయారు. జసిండా జవాబుతో విలేకరి ఆలోచనలో పడిపోయింది. సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్పడం అందరికి కుదరదు. దానికి ఎంతో మేథో శక్తి కావాలి. ఆలోచన కూడా ఉండాలి. అప్పుడే ఎదుటివారు వేసే ప్రశ్నలకు సరైన విధంగా సమాధానాలు చెప్పే అవకాశం ఉంటుంది.
త్వరలో మూడో దశ ముప్పు ఉందని హెచ్చరికల నేపథ్యంలో దేశం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచిస్తున్నారు. వేసవి కాలంలోనే కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. కరోనా ముప్పు పోయే వరకు దాంతో కలిసి సహజీవనం చేయాల్సిందేనని చెబుతున్నారు. విధిగా మాస్కులు ధరించి శానిటైజర్ రాసుకుంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజల అప్రమత్తతే శ్రీరామరక్ష అని చెప్పారు.
కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ల రూపంలో తన తీరు మార్చుకుని మరీ దూసుకుపోతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వైరస్ ధాటికి కుదేలైపోతున్నారు. ఎప్పటికప్పుడు మాస్కులు ధరించాలన్నారు. శానిటైజర్ పూసుకుని కరోనా రక్కసిని అదిమి పెట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేస్తోంది. ఇక్కడ అవలంభించే మార్గాలను అన్ని దేశాలు పాటించేందుకు పోటీ పడుతున్నాయని తెలుస్తోంది.