
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లవర్ బాయ్ గా.. యాక్షన్ లో కింగ్ గా.. ఫ్యామిలీ మ్యాన్ గా ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయాడు. ముఖ్యంగా లవర్ బాయ్ గా చేసిన పాత్రల్లో అయితే ప్రభాస్ అందచందాలు క్యూట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
‘బాహుబలి’తో ప్యాన్ ఇండియాస్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా సినిమాలు అనౌన్స్ చేశాడు. ఎప్పుడూ లేనంత వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ‘రాధేశ్యామ్’ పూర్తి చేయగా..సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే లైన్లో ఉన్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాతోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర పోషణ విషయంలో దర్శకుడు ఓంరౌత్ పలు జాగ్రత్తలు తీసుకున్నాడని తెలిసింది.
కరోనా కారణంగా షూటింగ్ లేకపోవడంతో ప్రభాస్ ఇష్టారీతిన భోజనం, ఆహార పానీయీలు తీసుకోవడంతో విపరీతంగా బరువు పెరిగి ఫేడ్ అవుట్ అయ్యాడని బాలీవుడ్ సర్కిల్స్ లో ఓ టాక్ నడుస్తోంది. ఆ బరువు పెరగడంతో శ్రీరాముడి పాత్రకు తగ్గట్టుగా ప్రభాస్ లేకపోవడంతో దర్శకుడు ఓంరౌత్ వెంటనే బరువు తగ్గాలని స్లిమ్ గా కావాలని కోరినట్టు తెలిసింది. ఈ సినిమాలో స్మార్ట్ లుక్ లో కనిపించాలని ఆదేశించడంతో విపరీతంగా బరువు పెరిగిన ప్రభాస్ తన శరీరంలో వచ్చిన మార్పులు శ్రీరాముడి పాత్ర పోషణకు ఇబ్బంది కాకూడదనే తలంపుతో ఇంగ్లండ్ కు బయలుదేరినట్టు సమాచారం. యూకేలోని వరల్డ్ క్లాస్ డాక్టర్ కమ్ డైటీషన్ వద్ద మెరుగైన చికిత్స తీసుకోనున్నాడట..
కరోనా లాక్ డౌన్ వేళ ప్రభాస్ విందులు, వినోదాల్లో మునిగితేలాడని.. అందుకే బరువు పెరిగాడని బాలీవుడ్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఫేడ్ అవుట్ అయిన ప్రభాస్ ను స్లిమ్ గా తయారవ్వాలని దర్శకుడు కోరినమీదటే ఇలా ఇంగ్లండ్ వెళ్లి బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.