నిర్భయ దగ్గరకే ఆ నలుగురు!

2012 నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో నలుగురు దోషులను ఉరి తీయడానికి ఇంక కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రేపు తెల్లారేసరికి వారి జీవితాలు పోనున్నాయి. దేశంలో సంచలనం సృష్టించిన కేసుకి దేశం నిద్రపోయి లేచేసరికి ఆ నలుగురి కథ ముగిసిపోనుంది. ఇప్పటివరకు చట్టంలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ వచ్చిన నిందితులు ఇక ఒక్క అవకాశం కూడా లేక పోవడంతో మృత్యుగడియలు ముంచుకొచ్చాయి. క్షణమొక గండంగా అనుక్షణం భయపడుతూ మరి కొన్ని […]

Written By: Neelambaram, Updated On : March 19, 2020 5:41 pm
Follow us on

2012 నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో నలుగురు దోషులను ఉరి తీయడానికి ఇంక కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రేపు తెల్లారేసరికి వారి జీవితాలు పోనున్నాయి. దేశంలో సంచలనం సృష్టించిన కేసుకి దేశం నిద్రపోయి లేచేసరికి ఆ నలుగురి కథ ముగిసిపోనుంది. ఇప్పటివరకు చట్టంలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ వచ్చిన నిందితులు ఇక ఒక్క అవకాశం కూడా లేక పోవడంతో మృత్యుగడియలు ముంచుకొచ్చాయి. క్షణమొక గండంగా అనుక్షణం భయపడుతూ మరి కొన్ని గంటలలో అనంతలోకాలలో కలిసిపోనున్నారు. ఆనాడు నిర్భయ చేసిన రోదన ఎంత భయంకరమో ఈనాడు వారికీ తెలిసి వస్తుంది.కానీ చివరికి ఆ నిర్భయ చేరిన మృతుఒడిలోకే నిందితులు వెళ్లనున్నారు.

నలుగురు దోషుల ఉరిశిక్షలను నిలిపివేయాలని కోరుతున్న పిటిషన్‌ ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. దింతో చివరి అవకాశం కూడా ముగిసిపోయింది. నలుగురు దోషులను తీహార్ జైలులో రేపు ఉదయం 5:30 గంటలకు ఉరి తీయనున్నారు.