
కరోనా భయం యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనాకు మందు లేకపోవడంతో.. దాని నివారణే మార్గమని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా పలువురు ప్రముఖులు, సినీనటులు కూడా తమ వంతు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే హీరో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు తమ బాధ్యతగా కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ వీడియోలు విడుదల చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వీడియో ద్వారా ప్రజలకు ధైర్యాన్ని.. సలహాలను పంచుకున్నారు.
“అందరికి నమస్కారం.. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకి గురి చేస్తున్న సమస్య కరోనా.. అయితే మనకి ఎదో అయిపోతుందన్న భయం కానీ, మనం ఏమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండు పనికిరావు. జగ్రత్తగా ఉండి, దైర్యంగా ఎదురుకోవాల్సిన సమయం ఇది.. జనసముహానికి వీలైనంత వరకూ దూరంగా ఉండండి. ఈ ఉద్రుత్తం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవ్వడం ఉత్తమం.
వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..మోచేతి వరకు చేతులను సబ్బుతో శుభ్రంగా సుమారు 22 సెకెండ్ల పాటుగా కడుక్కోండి! తుమ్మున, దగ్గిన కర్చీప్ లాంటివి అడ్డం పెట్టుకోవడం లేదా టిష్యు పేపర్ లను అడ్డు పెట్టుకోవడం తప్పనిసరి.. ఆ వాడిన టిష్యు పేపర్ కూడా చేత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి,కంటికి మొఖానికి,తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం,జలుబు,దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి! ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ప్రమాది కారి కాకపోయినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అవకాశం ఉంది. అలా కాకుండా చూసుకునే భాద్యత మన పైన ఉంది. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయ ప్రకారం నమస్కారం చేద్దాం.. అదే ఉత్తమం ” అని చిరంజీవి పేర్కొన్నారు.
https://youtu.be/hTAeqbdKzlM