NTR Wife Laxmiparvathi: వదిన.. వదిన.. అంటూ నా కాళ్లు మొక్కారు కదా..? కేసు పెడుతానంటూ హెచ్చరించిన లక్ష్మీపార్వతి

NTR Wife Laxmiparvathi : ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరు మార్చిన సీఎం జగన్ తీరుపై ఇప్పటికే నందమూరి కుటుంబం నుంచి బాలయ్య,, జూ.ఎన్టీఆర్ స్పందించారు. ఇక ఆయన భార్య అయిన లక్ష్మీపార్వతి స్పందన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకంటే ఆమె ఎన్టీఆర్ పై ఈగ వాలనీయదు. అన్ని విమర్శలను తిప్పికొడుతోంది. పైగా వైసీపీలో ఉంది. ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. ఈక్రమంలోనే తన భర్త పేరును తొలగించిన జగన్ పై లక్ష్మీపార్వతి ఏం […]

Written By: NARESH, Updated On : September 26, 2022 12:16 pm
Follow us on

NTR Wife Laxmiparvathi : ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరు మార్చిన సీఎం జగన్ తీరుపై ఇప్పటికే నందమూరి కుటుంబం నుంచి బాలయ్య,, జూ.ఎన్టీఆర్ స్పందించారు. ఇక ఆయన భార్య అయిన లక్ష్మీపార్వతి స్పందన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకంటే ఆమె ఎన్టీఆర్ పై ఈగ వాలనీయదు. అన్ని విమర్శలను తిప్పికొడుతోంది. పైగా వైసీపీలో ఉంది. ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. ఈక్రమంలోనే తన భర్త పేరును తొలగించిన జగన్ పై లక్ష్మీపార్వతి ఏం మాట్లాడుతారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

దీనిపై ఏబీఎన్ సహా కొన్ని టీడీపీ అనుకూల మీడియాలు అయితే లక్ష్మీపార్వతి రాజీనామా చేసిందని.. భర్తను అవమానించిన జగన్ కు దూరంగా జరిగిందని బోలెడన్నీ కథనాలు రాశాయి. దీంతో వాటన్నింటికి క్లారిటీ ఇస్తూ లక్ష్మీపార్వతి తాజాగా ఓ ప్రెస్ మీట్ పెట్టారు.

ఎన్టీఆర్ పేరు మార్పుపై కాదు, ఏబీఎన్‌లో వార్తలపైనే మాట్లాడతానంటూ లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌తో నా పెళ్లి గురించి ఎవరైనా మాట్లాడితే కేసు పెడతానంటూ హెచ్చరించారు.

నేను ఎన్టీఆర్ ను పెళ్లిచేసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే నాపై నాటి నుంచి వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని.. చరిత్ర చెరిపితే చెరిగిపోదని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్ తో పెళ్లి అవ్వటం చంద్రబాబుకు ఇష్టం లేదని.. మా వివాహ ప్రకటనను అడ్డుకోవడానికి చంద్రబాబు మైక్ వైరులు కట్ చేసి లైట్ లు ఆపేసి నానా బీభత్సం చేశాడని లక్ష్మీపార్వతి ఆరోపించారు.

ఎన్నికల్లో పోటీ చేయమంటే నేనే చెయ్యనని చెప్పానని లక్ష్మీపార్వతి తెలిపారు.నాకు టెక్కలి సీటు ఇస్తానన్న చేయనని ఎన్టీఆర్ కు చెప్పానని తెలిపారు. నన్ను పెళ్లి చేసుకున్నాకే టీడీపీ ఎక్కువ సీట్లు గెలిచింద్నారు. అల్లుళ్ల కొట్లాట వల్లే 1989లో టీడీపీ ఓడిపోయిందని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని లక్ష్మీపార్వతి అన్నారు. తాను వచ్చాకే టీడీపీ గెలిచిందన్నారు. “నా భార్య కన్నా ఏ దేవతా గొప్ప కాదు” అనేవారు.. ఓ భార్యకు ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఉంటుందా! అని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. నేను భార్యను మాత్రమే కాదు, ఎన్టీఆర్‌కు తల్లిలాంటిదాన్ని చివరివరకూ ఎన్టీఆర్‌కు నాపై గౌరవం, అభిమానం తగ్గలేదన్నారు.

ఈ విషయాలన్నీ నటుడు మోహన్ బాబుకు తెలుసు అని.. వదిన.. వదిన.. అంటూ నా కాళ్లు మొక్కారు కదా..? ఇప్పటికైనా నిజం చెబుతారో లేదో తేల్చుకోవాలని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్‌పై నాది ప్రేమ కాదు… భక్తి అని.. 6 నెలల్లో ఎన్టీఆర్ ను నడిచేలా చేశానని తెలిపారు.

ఇలా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించడానికి బదులు తనపై జరుగుతున్న కుట్రలకు మాత్రమే లక్ష్మీపార్వతి జవాబు ఇచ్చి అసలు విషయాన్ని వదిలేయడం గమనార్హం.