NTR Vennupotu:ఒకరు చస్తే కూడా పండుగలా చేసుకునే పాడు సంప్రదాయంలో మనం ఉన్నాం.. అయితే చనిపోయిన ఆ వ్యక్తికి నివాళులర్పించి ఆయన సృతులను అయిన వారు గుర్తు చేసుకుంటారు. కానీ వారు ఏం చేస్తారు? ఆయన చావుకు కారణమైన వారిని ఏకిపారేస్తారు. అసలే టైం కానీ టైంలో థర్డ్ వేవ్ లో కరోనా బారినపడి చికిత్స పొందుతున్న చంద్రబాబుకు ఈరోజు మరుపురాని రోజు అని అధికార వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.
ఎన్టీఆర్ వర్ధంతి నేడు. బాలకృష్ణ సహా ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ లో ఘనంగా నివాళులర్పించారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఎన్టీఆర్ ఉంటారని బాలయ్య బాబు ఎమోషనల్ అయ్యారు. అయితే ఇదే బాలయ్య నాడు బావ చంద్రబాబుతో కలిసి ఇదే ఎన్టీఆర్ ను అధికారంలోంచి కూలదూయడంలో కీలక పాత్ర పోషించాడని వైసీపీ శ్రేణులు ఆడిపోసుకుంటున్నాయి. ‘ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన నేడు ‘వెన్నుపోటు దినోత్సవం’ గా వైసీపీ శ్రేణులు జరుపుతున్నాయి.
లక్ష్మీపార్వతిని చేసుకొని నాడు ఎన్టీఆర్ ఏపీ రాజకీయాల్లో సీఎంగా చక్రం తిప్పారు.అయితే ప్రభుత్వ , పార్టీ వ్యవహారాల్లో లక్ష్మీపార్వతి జోక్యాన్ని సహించలేని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడబలుక్కొని చంద్రబాబును ముందుపెట్టి ఎన్టీఆర్ పార్టీని లాగేసుకున్నారు. అలా ఆయనను పదవీచిత్యుడిని చేశారు. ఆ బాధలోనే గుండెపోటుతో ఎన్టీఆర్ పరమపదించారు.
తప్పు ఒప్పుల సంగతి పక్కనపెడితే ఎన్టీఆర్ మరణానికి పరోక్షంగా చంద్రబాబే కారణం.. ఆయన వెన్నుపోటుతోనే ఎన్టీఆర్ మరణించారు. అందుకే ‘ఎన్టీఆర్ కు వెన్నుపోటు’ దినోత్సవాన్ని చంద్రబాబుపై పగతో వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ గ్రూపులు, సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయం..ఎంతో చేసినా కూడా ఈరోజు ఆయనకు ఒక పీడకలనే. ఇప్పటికే ఎన్నో సినిమాలు, రాజకీయ విమర్శలు వచ్చినా కూడా చంద్రబాబును ఈరోజు వీడడం లేదు. ఈసారి కూడా వీడదు. అయితే కరోనా బారినపడ్డ చంద్రబాబు ప్రస్తుతానికి ఈరోజు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించకపోవడమే ఒక లోటు అని చెప్పొచ్చు.