Railway Jobs : రైల్వే శాఖలో భారీగా ఉద్యోగా నియామకాలకు నోటిఫికేషన్(Notification) విడుదలైంది. దరకాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. టెన్త్, ఇంటర్ విద్యార్హతతో గ్రూప్–డీ లెవల్–1 కేటగిరీలో వివిధ విభాగాల్లో మొత్తం 32,438 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆసక్తి, ఆర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు ఇవీ..
రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 36 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీల అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఇక అభ్యర్థులు పదో తరగతి లేదా ఐటీఐ లేదా త్సమాన విద్యార్హత లేదా నేషనల్‌ప్రెంటిస్‌షప్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అర్హులు.
పోస్టుల వివరాలు..
సిగ్నల్ అండ్ టెలీ కమ్యూనికేషన్(ఎల్‌అండ్‌టీ), మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ తదితర విభాగాల్లో అసిస్టెంట్(ఎస్‌అండ్‌టీ), వర్క్‌షాప్ అసిస్టెంట్, అసిస్టెంట్ లోకోషెడ్(డీజిల్/ఎలక్ట్రికల్) పాయింట్స్‌మన్, అసిస్టెంట్ ఆపరేషన్(ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ట్రాక్ మెషీన్, ట్రాక్ మెయింటెయినర్ తదితర పోస్టులు ఉన్నాయి.
ఎంపిక, వేతనం ఇలా..
అభ్యర్థులను కంప్యూరట్ ఆధారిత పరీక్ష(సీబీటీ)(Computer base test), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల వేతనం ఇస్తారు.
పరీక్ష ఇలా..
ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా ఉంటుంది. 90 నిమిషాలపాటు జరిగే పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ సైన్స్ నుంచి 25 మార్కులు, మ్యాథమెటిక్స్‌నుంచి 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. తపుపడు సమాధానం రాస్తే 1/3 మార్కులు కట్ చేస్తారు.
దఖాస్తు ఫీజు వివరాలు..
రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500, దివ్యాంగులు/మహిళలు, ట్రాన్స్ జెండర్లు/ఎక్స్ సర్వీస్‌మెన్/ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ/ఈబీసీలు రూ.250 చొప్పున చెల్లించాలి. పరీక్షకు హాజరయ్యాక జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.400, మిగతావరికి రూ.250 రిఫండ్ చేస్తారు. దరఖాస్తులో మార్పులు చేర్పులకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వ తేదీ వరకు అవకాశం ఇస్తారు. ఇందుకోసం రూ.250(నాన్ రిఫండబుల్) చెల్లించాలి. మార్చి 6 తర్వాత దరఖాస్తుల్లో మార్పులకు అవకాశం ఉండదు.
హెల్ప్‌లైన్ నంబర్లు..
ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే 0172–565–3333 లేదా 9592001188 నంబర్లను సంప్రదించాలి లేదా rrb.help@csc.gov.in కు మెయిల్ చేయవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సంప్రదించాలి.