విశాఖపట్నంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. 10 మృతికి, కొన్ని వందల మంది అస్వస్థతకు కారణమైన ఈ సంఘటనను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ సంఘటన ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్నందున సుమోటోగా స్వీకరించడానికి కారణమని వెల్లడించింది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దుర్ఘటనను సుమోటోగా స్వీకరించలేదని స్పష్టం చేసింది. జనావాసాల మధ్య ఇంత ప్రమాదకరమైన రసాయన కర్మాగారం ఎందుకు ఉందని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈ సంఘటనకు సంబంధించి అమికస్ క్యూరీగా నియమించింది.
మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం జగన్
మరోవైపు వైజాగ్ స్టైరిన్ గ్యాస్ లీక్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హచ్‌ఆర్సీ) స్పందించింది. ఈ ఘటనపై స్పందించాలంటూ కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. కాగా ఎల్.జి పాలిమర్స్‌లో గ్యాస్ లీకైన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. అస్వస్థతకు గురైన వేలాది మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ ని అదుపులోకి తెచ్చినప్పటికీ.. అప్పటికే వాయువును పీల్చిన చాలా మంది ఎక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోతున్నారు. మూగజీవులు సైతం మృత్యువాతపడ్డాయి.