షూటింగ్ ఆరెంజ్ మెంట్స్ లో వకీల్ సాబ్

కొద్దిరోజుల క్రితం సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వాలంటూ నిర్మాతలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలవడం జరిగింది. దానికి ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతానడం జరిగింది. ఆ క్రమంలో ముఖ్యమంత్రి ఇంకా షూటింగ్స్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. జూన్ నుంచి లాక్ డౌన్ తీసి వేస్తారని , అపుడు షూటింగ్స్ కి పర్మిషన్ దొరుకుతుందని నిర్మాతలు ఆశ గా ఎదురు చూస్తున్నారు ఒకవేళ షూటింగ్స్ కి పర్మిషన్ ఇచ్చినాగాని తక్కువ మంది […]

Written By: admin, Updated On : May 7, 2020 5:05 pm
Follow us on


కొద్దిరోజుల క్రితం సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వాలంటూ నిర్మాతలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలవడం జరిగింది. దానికి ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతానడం జరిగింది. ఆ క్రమంలో ముఖ్యమంత్రి ఇంకా షూటింగ్స్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. జూన్ నుంచి లాక్ డౌన్ తీసి వేస్తారని , అపుడు షూటింగ్స్ కి పర్మిషన్ దొరుకుతుందని నిర్మాతలు ఆశ గా ఎదురు చూస్తున్నారు ఒకవేళ షూటింగ్స్ కి పర్మిషన్ ఇచ్చినాగాని తక్కువ మంది యూనిట్ సభ్యులతో జరుపుకోవాల్సి ఉంటుంది.

యాజమాన్యం నిర్లక్ష్యంతోనే గ్యాస్ లీక్: బీజేపీ

అందుకే షూటింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేదానిపై నిర్మాతలు, దర్శకులు తీవ్రంగా చర్చిస్తున్నారు .. ఆ క్రమంలో “వకీల్ సాబ్ ” చిత్రానికి సంబంధించి కోర్ట్ రూమ్ సన్నివేశాల చిత్రీకరణ ఇంకా పెండింగ్ ఉంది. కోర్ట్ సీన్ అంటే జూనియర్ ఆర్టిస్టులు బాగానే కావాలి. దాన్ని నివారించాలి అంటే కేవలం క్లోజప్ షాట్స్ లేదా ఒకరిద్దరు నటీనటులు మాత్రమే అవసరం అయ్యే సజెషన్ షాట్స్ లాంటివి ప్లాన్ చేసుకొని సినిమా ఫినిష్ చేయాలని చూస్తున్నారట. అలా అయితేనే ఆగష్టు లోగా సినిమా పూర్తి చేయ గలుగుతామని వకీల్ సాబ్ చిత్ర యూనిట్ భావిస్తోంది .