ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. గత నాలుగురోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ప్రతీరోజు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ మధ్యే జరుగుతున్నాయి. ఈక్రమంలో అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీపై అధికారపక్ష నేతలు ఎదురుదాడికి దిగుతుండటంతో సభలో రచ్చ కంటిన్యూ అవుతోంది.
Also Read: నవ్వులు పంచిన అసెంబ్లీ
గురువారం కూడా అసెంబ్లీ సమావేశాలో హాట్ హాట్ గా కొనసాగాయి. మహిళ సంక్షేమంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన రోజా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. ఆయన కుమారుడు మాజీ మంత్రి లోకేష్ పై నిప్పులు చెరిగారు. జగన్ ఫేక్ సీఎం కాదని.. చంద్రబాబును షేక్ చేసే సీఎం అంటూ సైటర్లు వేశారు.
చంద్రబాబుది 420విజన్ అని.. జగన్ విజన్ ఓ విప్లవం అంటూ కొనియాడారు. జగన్ వచ్చే జనరేషన్ గురించి సైతం ఆలోచించి పథకాలను అమలు చేస్తున్నారంటూ కొనియాడారు. ప్రతీ ఆడబిడ్డను రక్షించే దిశ చట్టాన్ని తీసుకొచ్చారని.. వారి సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన క్రియేటర్ జగన్ అంటూ అసెంబ్లీలో రోజా వ్యాఖ్యలు చేశారు.
Also Read: జగన్ సర్కార్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ
చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు ఎవరో రాసిచ్చిన స్క్రీప్టును ట్వీటర్లో పెట్టడమే సరిపోతుందంటూ విమర్శించారు. చంద్రబాబుని అండగా లేకుండా లోకేష్ బాబు కనీసం సర్పంచ్ గా కూడా గెలువలేరని ఎద్దేవా చేశారు. పేదలకు ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేస్తుంటే వాటిని కూడా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని రోజా విమర్శించారు. నగరి ఎమ్మెల్యే రోజా ఓ వైపు జగన్ ను ఆకాశానికెత్తుతూనే మరోవైపు టీడీపీ నేతలను చెడుగుడు ఆడుకోవడం గమనార్హం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్