https://oktelugu.com/

అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో జమ్మికుంటకు 10వ స్థానం

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుండ పోలీస్ స్టేషన్ కు  ప్రత్యేక గౌరవం లభించింది. భారతదేశ అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో జమ్మికుంటకు 10వ స్థానం దక్కింది. దీంతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 16 వేలకు పైగా పోలీస్ స్టేషన్లలో పది పోలీస్ స్టేషన్లను ప్రతి సంవత్సరం కేంద్ర హోంశాఖ ప్రకటిస్తుంది. గత సంవత్సరం ఇదే జిల్లాలోని చొప్పందండికి 8వ స్థానం వచ్చింది. తాజాగా జమ్మికుంటకు 10వ స్థానం […]

Written By: , Updated On : December 3, 2020 / 05:30 PM IST
Follow us on

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుండ పోలీస్ స్టేషన్ కు  ప్రత్యేక గౌరవం లభించింది. భారతదేశ అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో జమ్మికుంటకు 10వ స్థానం దక్కింది. దీంతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 16 వేలకు పైగా పోలీస్ స్టేషన్లలో పది పోలీస్ స్టేషన్లను ప్రతి సంవత్సరం కేంద్ర హోంశాఖ ప్రకటిస్తుంది. గత సంవత్సరం ఇదే జిల్లాలోని చొప్పందండికి 8వ స్థానం వచ్చింది. తాజాగా జమ్మికుంటకు 10వ స్థానం రావడంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసర్ రెడ్డి జిల్లా పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలతో పాటు, పోలీస్ సిబ్బంది పనితీరుపై సర్వే నిర్వహించి అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక చేశారు.