
ప్రపంచంలో ఏ దేశం నుంచైనా ఏ దేశానికైనా ఎవరైనా వెళ్లొచ్చు. అందుకు కొన్ని షరతులు ఉంటాయి. వాటిని పాటిస్తూ ఇతర దేశాల్లో అడుగుపెట్టొచ్చు. అయితే.. అవకాశాలకు పెట్టింది పేరైన అమెరికా మాత్రం తాజాగా కొన్ని నిబంధనల విధించింది. ఏ దేశానికి చెందినవారైనా.. వారు కమ్యూనిస్టు పార్టీ సభ్యులు లేదా నిరంకుశ అధికారం చెలాయించే తరహా పార్టీల సభ్యులు మాత్రం ఇకపై అమెరికాలో అడుగుపెట్టడానికి వీలులేదట.
Also Read: భారత్ లో కరోనా మరణాలు తగ్గడానికి అసలు కారణమిదే..?
తమ దేశంలో ప్రవేశానికి ‘కమ్యూనిస్టు/నిరంకుశ పార్టీల సభ్యత్వమే’ అనర్హతగా పేర్కొంటూ.. అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) తాజాగా విధాన మార్గదర్శకాల పత్రాన్ని జారీ చేసింది. నిజానికి, కమ్యూనిస్టు పార్టీ సభ్యులకు అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ 1952లోనే చట్టం చేశారు. ఇప్పుడు దాన్ని కఠినంగా అమలు చేసేలా విధాన మార్గదర్శకాలను తెచ్చారు. అమెరికా భద్రత కోసమే ఈ మార్గదర్శకాలను విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
వాణిజ్యం, హాంకాంగ్ భద్రత చట్టం, జిన్‌జియాంగ్ ప్రాంతంలో వీఘర్ ముస్లింలపై ఉక్కుపాదం లాంటి అంశాల్లో చైనాతో పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషిస్తున్నారు. అమెరికా లక్ష్యం చైనానే అయినా.. దీని ప్రభావం భారత్ సహా, ప్రపంచంలోని పలు దేశాల కమ్యూనిస్టు పార్టీ సభ్యులపై ఉంటుందని వారు పేర్కొంటున్నారు. కాగా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలో చేరినవారికి మినహాయింపు ఉంటుందని 1952 చట్టంలోనే పేర్కొన్నారు. దాన్ని ఇప్పుడూ కొనసాగిస్తారు.
Also Read: ట్రంప్ కు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్.. కుదుటపడుతున్న ఆరోగ్యం. .
అమెరికా ప్రధానంగా చైనాను టార్గెట్ చేసి ఈ విధానాన్ని పటిష్టం చేసినట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టు దేశమైన చైనా నుంచే ప్రజలను అమెరికాకు రాకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఇప్పటికే చైనాను పలువిధాలా దెబ్బతీస్తున్న అమెరికా.. ఇప్పుడు ఈ రకంగానూ జైలులో పడేసినట్లు చేసింది.
Comments are closed.