
కరోనా విజృంభిస్తున్న సమయంలో పరీక్షలు నిర్వహించవద్దంటూ హైదాబాద్‌లోని జేఎన్‌టీయూ వద్ద విద్యార్థులు సోమవారం నిరసన ఉద్రిక్తంగా మారింది. జేఎన్‌టీయూ కళాశాల గేటు దూకి విద్యార్థులు లోపలికి చొచ్చుకుపోవడంతో పోలీసులు లాఠీ ఝులిపించారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.