ఏపీలో దారుణం జరిగింది. ఏపీ సీఎం నివాసానికి కేవలం కి.మీ దూరంలో యువతిపై ఇద్దరు దుండగులు బెదిరించి గ్యాంగ్ రేప్ నకు పాల్పడడం కలకలం రేపింది. కాబోయే భర్తతో సాయంత్రం కృష్ణా నది తీరంలో ఇసుక తెన్నెలపైకి వచ్చిన యువతిని ఘోరంగా అత్యాచారం చేశారు. సరదాగా నదీ తీరంలోని ఇసుక తిన్నెలపై వచ్చిన ఈ జంటపై అక్కడే మాటు వేసిన దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. అత్యంత పాశవికంగా యువతి ముఖాన్ని ఇసుకలో కప్పి మరీ ఈ అత్యాచారం చేశారు.
కాబోయే భర్త ముందే ఈ రేప్ జరిగింది. అతడి చేతులను కట్టేసి ఒక బ్లేడుతో అతడి గొంతుపై పెట్టి ఆ యువతిపై అతడి కళ్లముందే దారుణంగా అత్యాచారం చేశారు. ఒకరు తర్వాత ఒకరు ఇలా ఇద్దరూ సీఎం నివాసానికి కిలోమీటరున్నర దూరంలో ఈ ఘోరానికి పాల్పడడం ఏపీలో భద్రతా వైఫల్యాన్ని కొట్టొచ్చినట్టు ఎత్తిచూపుతోంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరం కృష్ణా నది పుష్కరఘాట్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన ఓ యువతి ఈ అత్యాచారానికి గురైంది. శనివారం రాత్రి ఎనిమిదింటికి విధులు ముగిశాక కాబోయే భర్తతో కలిసి విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతానగరం పుష్కరఘాట్ వైపు ఆమె వచ్చింది. నదిలోపలికి ఇసుకతిన్నెలపై వారు కూర్చోగా.. అక్కడే మాటు వేసిన ఇద్దరు దుండగులు వీరిపై పడి బ్లేడ్లు చూపుతూ చంపేస్తామని బెదిరించి యువకుడి చేతులు అమ్మాయి చున్నీతో కట్టేసి ఆమె ఇసుకలోకి ఈడ్చుకెళ్లి యువతిపై అత్యాచారం చేశారు. రెండో దుండగుడు అత్యాచారం చేశారు.
ఆ సమయంలో బాధితులు కేకలు వేసినప్పటికీ ఆ ప్రాంతం రోడ్డుకు దూరంగా ఉండడంతో పాటు చిమ్మచీకటి కావడం వల్ల ఎవరికీ వినిపించలేదు. యువ జంట వద్దనున్న సెల్ ఫోన్లు, డబ్బు , బాధితురాలి చెవిదుద్దులు దోచుకొని నిందితులు పారిపోయారు. ఓ ద్విచక్ర వాహనదారుడు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితులు అత్యాచారం చేశాక నాటు పడవలో నదీ మార్గంలో విజయవాడ వైపు పారిపోయారు. వీరు విజయవాడ నుంచి వచ్చిన బ్లేడు బ్యాచ్ అయ్యి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఇక సీతానగరం ఇసుక తిన్నెల ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అని.. అక్కడ గంజాయి, మద్యం విచ్చలవిడిగా సాగుతాయని.. దోపిడీలు జరిగినట్టు తెలిసినా పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం నివాసానికి కి.మీన్నర దూరంలోనే ఇలా జరిగితే ఎలా అని అందరూ ప్రశ్నిస్తున్నారు.