https://oktelugu.com/

ఎన్టీఆర్, రామ్ చరణ్ కోసం ఆ సంగీత సంచలనం

యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ తెలుగులో రెండు పెద్ద సినిమాలు కంపోజ్ చేయడానికి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడని సమాచారం.. పవన్ కళ్యాణ్ “అజ్ఙాతవాసి” కోసం ఈ తమిళ సంగీత సంచలనం మంచి మ్యూజిక్ అందించాడు. అయినా ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ కావడంతో ఇతడికి తెలుగులో సరైన అవకాశాలు దక్కలేదు. చిత్రనిర్మాతలు ఇక అనిరుధ్ ను ఇతర పెద్ద ప్రాజెక్టుల కోసం సంప్రదించడం లేదు. ఇక హీరో నాని తీసిన “జెర్సీ” కోసం […]

Written By:
  • NARESH
  • , Updated On : June 21, 2021 10:59 am
    Follow us on

    యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ తెలుగులో రెండు పెద్ద సినిమాలు కంపోజ్ చేయడానికి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడని సమాచారం.. పవన్ కళ్యాణ్ “అజ్ఙాతవాసి” కోసం ఈ తమిళ సంగీత సంచలనం మంచి మ్యూజిక్ అందించాడు. అయినా ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ కావడంతో ఇతడికి తెలుగులో సరైన అవకాశాలు దక్కలేదు. చిత్రనిర్మాతలు ఇక అనిరుధ్ ను ఇతర పెద్ద ప్రాజెక్టుల కోసం సంప్రదించడం లేదు.

    ఇక హీరో నాని తీసిన “జెర్సీ” కోసం అనిరుధ్ పనిచేశాడు. ఆ సినిమాకు ఎంతో గొప్ప సంగీతం అందించాడు. ఇది ఎంతో ప్రశంసించబడింది. ఇక తమిళంలో విజయ్ “మాస్టర్” మూవీకి సంగీతం అందించాడు. ఆ సినిమా భారీ విజయం తరువాత టాలీవుడ్ పెద్ద తారలు అతనితో కలిసి పనిచేసే విశ్వాసాన్ని పొందారు.

    కొరటాల శివ దర్శకత్వం వహించబోయే #ఎన్టీఆర్ 30 సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం కంపోజ్ చేస్తాడని సమాచారం. అతని పేరు త్వరలో అధికారికంగా ప్రకటించబడుతుందని తెలుస్తోంది.

    తాజా సంచలనం ఏమిటంటే దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్రం రామ్ చరణ్ కోసం అనిరుధ్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు తెలిసింది. ప్రారంభంలో ఈ సినిమాకు తన అస్థాన సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ తోనే చేయాలని అనుకున్నాడట.. కానీ ఇప్పుడు అనిరుధ్ పేరు పరిగణించబడుతోంది.

    అనిరుధ్-శంకర్ కాంబినేషన్ లో ఇప్పటికే ‘ఇండియన్ 2’ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఇది చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది. అనిరుధ్ ఈ రెండు పెద్ద సినిమాలకు బ్లాక్ బస్టర్ సంగీతాన్ని అందిస్తే, అతను దక్షిణాదిలోనే బిజీ అవుతాడు. చిత్రనిర్మాతలకు విస్తృత ఎంపిక గా మారుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.