కరోనా సగటు మానవుని జీవితాన్ని దెబ్బతీసింది. వైరస్ మన దేశంలోకి వచ్చి ఆరు నెలలవుతోంది. ఈ సమయంలో దేశ ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్రప్రభత్వం ఒక్కరోజు జనతా కర్ఫ్యూ విధిస్తే తూచ తప్పకుండా పాటించారు. ఆ తరువాత లాక్ డౌన్ విధిస్తే ఎన్నో బాధలు భరించారు. అయితే లాక్ డౌన్ కే ప్రజలు సహకరించారంటే ఆ సమయంలో ప్రభుత్వాలు ఏం చేయాలి..? లాక్ డౌన్ సమయంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపగలిగారు.. కానీ ఆన్ లాక్ తరువాత ఈ ప్రభావాన్ని ఎందుకు కంట్రలోల్ చేయలేదు..? అనే విషయాలపై నిలదీస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
Also Read: ప్రభుత్వాలను కోర్టులు కూల్చగలవా? చరిత్ర ఏం చెబుతోంది?
ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కరోనా విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను నిలదీశారు. కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పనిచేశాయి. వైరస్ ఎక్కువవుతున్న సమయంలో చేతులెత్తేశాయి..వైరస్ ప్రవేశించి ఇన్ని రోజులైన ప్రజల కోసం, బాధితుల కోసం ఏ ఒక్కటీ సరైన పథకం ప్రకటించలేదని ఆయన విమర్శించారు. కరోనా సోకిన వారిక రెండువేల రూపాయల చొప్పున ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు.
దేశంలో ఆపద వచ్చినప్పడు నిపుణులతో కమిటీ వేసి తగిన పరిష్కారం చేయాలన్నారు. కానీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మాత్రం సంక్షేమ పథకాలంటూ కరోనా గురించి పట్టించుకోవడం లేదన్నారు. లాక్ డౌన్ ఎందరో మంది ఉద్యోగాలు కోల్పోయారు.. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కూలీలకు పూటగడవని పరిస్థితి దాపురించింది. కానీ ప్రభుత్వ వీరి ఆర్థికాభివద్ధికి ఏ విధమైన సాయం చేయడం లేదన్నారు.
Also Read: ఆ వైరస్ కు వ్యాక్సిన్ సక్సెస్.. చికిత్సకు అనుమతులు ఇచ్చిన అమెరికా
మరోవైపు కరోనా చికత్స పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల జేబులకు చిల్లలు పెడుతున్నాయి. లక్షల రూపాయల్లో ఫీజలు వసూలు చేస్తున్నా ప్రభుత్వాలు ఏమీ మాట్లాడకుండా ఉండడం శోచనీయమన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే తిరిగి వస్తామో.. రామోనన్న భయం ప్రజల్లో కలుగుతుందన్నారు. ఇలాంటి అంశాలపై ప్రభుత్వాలు చర్చలు పెట్టి పరిష్కార మార్గం చూడాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.