ప్రభుత్వాలను కోర్టులు కూల్చగలవా? చరిత్ర ఏం చెబుతోంది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తన ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారని.. కొందరితో కలిసి కుట్ర పన్నుతున్నారని ఆ లేఖలో వాపోయారు. ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో న్యాయవ్యవస్థపై సంచలనమైన వ్యాఖ్యలే చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కొందరు జగన్ సర్కార్ ను ఇబ్బందులు పెడుతున్నారని ఆ వ్యాఖ్యల సారాంశం. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున […]

Written By: NARESH, Updated On : October 16, 2020 9:58 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తన ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారని.. కొందరితో కలిసి కుట్ర పన్నుతున్నారని ఆ లేఖలో వాపోయారు. ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో న్యాయవ్యవస్థపై సంచలనమైన వ్యాఖ్యలే చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కొందరు జగన్ సర్కార్ ను ఇబ్బందులు పెడుతున్నారని ఆ వ్యాఖ్యల సారాంశం. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టుకు విన్నవించినట్లు చెప్పారు.

Also Read: దేశంలో ఆపద వచ్చింది.. ఆదుకునేవారే లేరా? : ఉండవల్లి హాట్ కామెంట్స్

దీనిపై దేశవ్యాప్తంగా బార్‌‌ అసోసియేషన్లు నిరసనలు తెలిపాయి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై పలువురు న్యాయశాస్త్ర నిపుణులు, సీనియర్ అడ్వకేట్లు, రిటైర్డ్ జడ్జిలు కోర్టుకు ఎక్కారు.. సీఎం జగన్‌ సీజేఐకి లేఖ రాయడం గర్హనీయమని తెలిపారు. న్యాయవ్యవస్థ పటిష్టతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ ను రాజీనామా చేయాలంటూ లేఖ రాశారు. దీంతో ఇప్పుడు సీఎం జగన్ రాజీనామా అంశం హాట్ టాపిక్ గా సాగుతోంది.

సుప్రీం కోర్టు జడ్డికి సీఎం జగన్ రాసిన లేఖతో ఆయన రాజీనామా చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే జగన్ రాజీనామా చేస్తాడా..? అనే చర్ఛ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ సమయంలో రాజీనామా చేస్తారు.. చేసినా ఆయన రాజీనామాను ఎప్పుడు ఆమోదించవచ్చు..? అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

జగన్ ప్రభుత్వంలో ప్రస్తుతం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సగం మంది జగన్ వద్దనుకుంటే వారు రాష్ట్ర గవర్నర్ వద్దకు వెళ్లి అవిశ్వాస తీర్మానం పెడుతారు. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపితే అసెంబ్లీలో అవిశ్వాస పరీక్ష పెడుతారు. ఈ పరీక్షలో ముఖ్యమంత్రికి సగం కంటే ఎక్కువ మంది ఎమ్మల్యేల మద్దతు పలికితే ప్రభుత్వం నెగ్గుతుంది. లేదంటే ప్రభుత్వం కూలిపోతుంది. కానీ జగన్ అంటే ప్రాణమిచ్చే.. జగన్ ఫొటోను పెట్టుకొని గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ సాహసం చేసే అవకాశాలు లేవు. జగన్ అందరూ కొత్త వారు.. నీతి నిజాయితీగల వారిని..జింపింగ్ లు చేయని వారిని చేర్చుకొని గెలిపించుకున్నారు.

ఇక మరో పద్ధతిలో సీఎం రాజీనామా ఆమోదం కావడానికి ఆర్టికల్ 356 ఉపయోగపడుతుంది. అయితే రాష్ర్టంలో అశాంతి నెలకొన్నప్పుడు, అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పడు గవర్నర్ పరిస్థితులను గమనిస్తారు. ఇక్కడి పరిస్థితులను కేంద్ర హోం శాఖ మంత్రికి సిఫార్సు చేస్తారు. దీంతో ఈ విషయం రాష్ర్టపతి వద్దకు చేరి అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్..

చరిత్రలో చూసుకుంటే ఇలాంటి ఘటనలు ఏవీ లేవు. కోర్టులు స్వయంగా ఒక ప్రభుత్వాన్ని కూల్చిన ఘటనలు లేవు. కూలిపోయే ప్రమాదంలో ఉంటే రాజ్యాంగ పరిరక్షణ చేయడం.. అసమ్మతి రాజేస్తే వాటిపై స్టేలు, సరైన తీర్పులు ఇవ్వడం మాత్రమే చేశాయి. మొన్నటికి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్-కుమారస్వామి సర్కార్ కు వ్యతిరేకంగా గళమెత్తిన ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంలోనూ సుప్రీం కోర్టు గళమెత్తి వారిని సస్పెండ్ చేసింది. ప్రభుత్వాలను కాపాడిన చరిత్ర, రాజ్యాంగాన్ని పరిరక్షించిన చరిత్ర సుప్రీం కోర్టుకు ఉంది. కానీ కూల్చిన దాఖలాలు అయితే ఏవీ లేవు.

అయితే ఈ విషయాలు ప్రతిపక్షాలకు, కోర్టులకు తెలియంది కాదు. దీంతో ఇప్పుడు జగన్ ను రాజీనామా చేయాలని కొందరు సుప్రీం కోర్టుకు ఎక్కడం.. ప్రతిపక్ష చంద్రబాబు సహా మరికొందరు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. ఈపాటికే సీఎం జగన్ రాజీనామా ఎందుకు చేస్తాడు..? 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి 50శాతానికి పైగా ప్రజలు ఓటు వేసి గెలిపించిన జగన్ ను రాజీనామా చేయడం అంటే అది ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. సుప్రీం కోర్టు తలుచుకుంటే జగన్ రాజీనామా ఆమోదం అవుతుందని కొందరు చర్చలు పెట్టడం సరికాదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాల తప్పులను కోర్టులు ఎత్తి చూపొచ్చు.. కానీ ప్రభుత్వాలను కోర్టులు కూల్చలేవని కొందరు న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. సుప్రీం కోర్టులో జగన్ రాజీనామాపై పిటిషన్ దాఖలు కాగానే కొందరు సంబరపడిపోవడం చూస్తే వారి అమాయకత్వమేనని వైసీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.