అన్ని కేసులు సీబీఐకి.. న్యాయం జరుగుతోందా?

దేశంలో ఏ కేసునైనా సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి అప్పగించాలని డిమాండ్ చేస్తారు. కోర్టులు, పోలీసులు ఎన్ని ఉన్నా సీబీఐ ద్వారా విచారణ చేపడితే నిజనిజాలు బయటికి వస్తాయని, సత్వర న్యాయం జరుగుతుందని పిటిషన్ దారులు కోరుకుంటారు. ఎందుకంటే సీబీఐ స్వతంత్ర సంస్థ. ఏ రాజకీయ, ప్రైవేట్ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తనకు అప్పగించిన ప్రతి కేసును సమగ్రంగా విచారణ చేపడుతుంది. అన్ని కోణాలు దర్యాప్తు చేసి సత్వర కాలంలో కేసును పూర్తి చేస్తుంది. Also Read: […]

Written By: NARESH, Updated On : October 16, 2020 9:47 am
Follow us on

దేశంలో ఏ కేసునైనా సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి అప్పగించాలని డిమాండ్ చేస్తారు. కోర్టులు, పోలీసులు ఎన్ని ఉన్నా సీబీఐ ద్వారా విచారణ చేపడితే నిజనిజాలు బయటికి వస్తాయని, సత్వర న్యాయం జరుగుతుందని పిటిషన్ దారులు కోరుకుంటారు. ఎందుకంటే సీబీఐ స్వతంత్ర సంస్థ. ఏ రాజకీయ, ప్రైవేట్ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తనకు అప్పగించిన ప్రతి కేసును సమగ్రంగా విచారణ చేపడుతుంది. అన్ని కోణాలు దర్యాప్తు చేసి సత్వర కాలంలో కేసును పూర్తి చేస్తుంది.

Also Read: దేశంలో ఆపద వచ్చింది.. ఆదుకునేవారే లేరా? : ఉండవల్లి హాట్ కామెంట్స్

అయితే చిన్నా చితక కేసులు కాకుండా కోర్టులు పరిష్కరించలేని కేసులు మాత్రమే సీబీఐకి అప్పగిస్తుంటారు. కానీ ఇటీవల సీబీఐపై కూడా నమ్మకం సన్నగిల్లుతుందా..? అవసరం లేని కేసులను సైతం సీబీఐ టేకాఫ్ చేస్తుందా..? అనే చర్చ సాగుతోంది. పలు కోణాలో చూస్తే ఇది నిజమోనేమోనని అనిపిస్తుంది.

ఇటీవల ఆంద్రప్రదేశ్లో ప్రభుత్వానికి కోర్టుకు విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. జగన్ వేస్తున్న ప్రతీ కేసుపై ఏదో రకంగా ప్రభుత్వానికే దెబ్బ పడుతోంది. ఉదాహరణకు అమరావతి కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి జగన్ కు ప్రతీసారి వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆయన సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ప్రతిపక్షాలు సైతం ప్రతీ కేసును సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ఇటీవల జడ్జిలపై వైసీపీ నాయకుల ధూషణల కేసును సైతం సీబీఐ విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు వైఎస్ వివేకానంద హత్యకేసు, డాక్టర్ సుధాకర్ పై దాడి కేసు సీబీఐనే విచారణ చేపడుతుంది.

Also Read: ప్రభుత్వాలను కోర్టులు కూల్చగలవా? చరిత్ర ఏం చెబుతోంది?

అయితే కొన్ని కేసుల విషయంలో సీబీఐ కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గినట్లు ఆరోపణలున్నాయి..ముఖ్యంగా బాబ్రీ మసీదు కేసులో ఒక్కరూ కూడా దోషులు లేరని సీబీఐ కోర్టు తేల్చడంతో కొందరు బహిరంగంగానే సీబీఐని విమర్శించారు. ఇక నోట్ల రద్దు సమయంలో శేఖర్ రెడ్డిపై అనేక కేసులు నమోదయ్యయి. స్వయంగా కట్టలకు కట్టలు డబ్బులు దొరికి మీడియాకు చూపించారు. కొత్త నోట్లను ఆయన మార్చారని అప్పుడు వార్తలు వచ్చాయి. ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తే ఆయన నిర్దోషి అని తేల్చింది. దీంతో సీబీఐపై కూడా ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లు పెరిగి కేసులు నీరుగారుతున్నాయన్న అన్న చర్చ జరుగుతోంది.