YS Sharmila: ఆంధ్రా వద్దని తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానన్న షర్మిల శపథాలు బ్రేక్ తీసుకుంటున్నాయి. అదేనండి.. ఇప్పుడు షర్మిల పాదయాత్ర చేస్తోంది కదా.. ఆ యాత్రకు మరోసారి బ్రేక్ ఇచ్చి అమెరికా వెళ్తోందని సమాచారం. ఎండలు దంచికొడుతున్నాయనో మరే ఇతర కారణమో తెలయదు గానీ.. సడెన్‌గా అమెరికా టూర్ వేసింది షర్మిలమ్మ.
రాజన్న రాజ్యం తేవడం ఏమో గానీ.. కనీసం ఆమెను గుర్తించిన జనులే లేరు. తెలంగాణలో షర్మిల అనే రాజకీయ లీడర్ ఉందని ఎవరికీ పెద్దగా తెలియట్లేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే కాదు మొదటి నుంచి తెలంగాణలో ఆమె పరిస్థితి ఇలాగే ఉంది. ఆమెను పట్టించుకునే వారే కరువయ్యారు.
Also Read: Punjab: తెల్లారిన కూలీ బతుకులు.. గుడిసెలో ఏడుగురు సజీవదహనం..!
ఆమె నమ్ముకున్న మీడియా కూడా ఆమెను హైలెట్ చేయట్లేదు. అయినా సరే నిరుద్యోగుల తరఫున నిరసనలు అంటూ పెయిడ్ కార్యకర్తలతో హడావిడీ చేసింది. వాటితో పెద్దగా గుర్తింపు రావట్లేదని తండ్రి బాటలోనే చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకుంది.
791 కిలో మీటర్లు నడిచిన షర్మిల వెంట.. నిత్యం ఒకే కార్యకర్తలు ఉంటున్నారు. ప్రతి నియోజకవర్గానికి కొత్త కార్యకర్తలు వస్తేనే ఆ ప్రాంతంలో తమ పార్టీకి కార్యకర్తలు ఉన్నట్టు లెక్క. కానీ ఎక్కడకు వెళ్లినా.. ఒకే కార్యకర్తలు ఉండటం అంటే.. వారంతా పెయిడ్ అనే కదా. మరి వారితో ఎంతకాలం అని పాదయాత్రను లాక్కొస్తుంది చెప్పండి.
పైగా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఒకసారి రు. ఎమ్మెల్సీ కోడ్ అని, మరోసారి కొవిడ్ కారణంగా చాలా రోజులు ప్రజా ప్రస్థాన యాత్ర వాయిదా పడుతూ వచ్చింది. ఇక అన్నింటినీ దాటుకుని పాదయాత్ర చేస్తే.. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇటు రాజకీయాల్లో కూడా ఆమె పాదయాత్రకు పెద్దగా హైప్ రావట్లేదు. అటు మీడియాలో అయితే అసలే కనిపించట్లేదు. దీంతో ఆమె విసిగిపోయందని సమాచారం. ఒక నెల రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత అమెరికా నుంచి వస్తారని తెలుస్తోంది. ఎండలు మండుతున్నందునే నిర్ణయం తీసుకుందా లేక మరేదైనా కారణంతో అమెరికా వెళ్తున్నారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
Also Read:
CM Jagan Chiranjeevi: సీఎం జగన్ డిమాండ్స్ కి నో చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.