https://oktelugu.com/

Power Star Pavan Kalyan: ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యబోతున్న పవర్ స్టార్.. షాక్ లో ఫాన్స్

Power Star Pavan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో గబ్బర్ సింగ్ అనే సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ది బెస్ట్ కం బ్యాక్ ఇచ్చిన హీరోలలో ఒక్కరిగా నిలిచాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో..దాదాపుగా పదేళ్ల నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానుల ఆకలిని తీర్చింది ఈ సినిమా..డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే చూడాలి అని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 20, 2022 / 03:24 PM IST
    Follow us on

    Power Star Pavan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో గబ్బర్ సింగ్ అనే సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ది బెస్ట్ కం బ్యాక్ ఇచ్చిన హీరోలలో ఒక్కరిగా నిలిచాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో..దాదాపుగా పదేళ్ల నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానుల ఆకలిని తీర్చింది ఈ సినిమా..డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే చూడాలి అని అభిమానులు కోరుకున్నారో..వారి అంచనాలకు మించి ఎంతో పవర్ ఫుల్ గా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూపించి ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం తిరగరాసాడు..మళ్ళీ ఈ కాంబినేషన్ పదేళ్ల తర్వాత సెట్స్ మీదకి వెళ్లనుంది..వీళ్లిద్దరి కాంబినేషన్ లో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాని ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే..దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా చాలా కాలం క్రితమే విడుదల చేసింది ఆ చిత్ర బృందం..జూన్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

    Power Star Pavan Kalyan

    ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క లేటెస్ట్ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది..అదేమిటి అంటే ఈ సినిమా లో మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది అట..పూజ హెగ్డే తో పాటుగా మరో ఇద్దరు హాట్ హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది..వారిలో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి కూడా ఉంది అని టాక్ వినిపిస్తుంది..ఈ ఇద్దరి హీరోయిన్స్ తో పాటు ఒక్క టాప్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ కూడా పెట్టించబోతున్నాడు అట హరీష్ శంకర్..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాలేజీ లో ఒక్క ప్రొఫెసర్ గా కనిపించబోతున్నాడు అట..ఆయన పాత్ర అభిమానులకు పూనకాలు రప్పించేలా చేస్తుంది అట..ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ లోని ఎనర్జీ మరియు నటన ఆయన పాత సినిమాలు అయిన ఖుషి, బద్రి కాలం నాటి వింటేజ్ పవన్ కళ్యాణ్ ని తలపించేలా ఆయన పాత్రని తీర్చి దిద్దాడు అట హరీష్ శంకర్.

    Also Read: Star Heroes: స్టార్ హీరోలకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇవే..!

    Krithi Shetty, Pooja Hegde

    పవన్ కళ్యాణ్ ఒక్క ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా లో నటించి చాలా ఏళ్ళు అయ్యింది..అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆయన చేసిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ చిత్రాలు చాలా సీరియస్ నేపథ్యం లో కొనసాగే సినిమాలు..పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్..అలాంటిది ఆయన నుండి అభిమానులు ఎంతో కాలం నుండి ఎంటర్టైన్మెంట్ జానర్ సినిమాలు మిస్ అవుతూ ఉన్నారు..మళ్ళీ ఇనెళ్లకు పవన్ కళ్యాణ్ ఆ ట్రాక్ ఎక్కడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యాయి..ఈ సినిమాని కేవలం ఎంటర్టైన్మెంట్ తో మాత్రమే కాదు గొప్ప సందేశం తో ఎంతో అద్భుతంగా రాసుకున్నాడు అట హరీష్ శంకర్..మరి ఈ క్రేజీ కాంబినేషన్ అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి..మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు..గతం లో గబ్బర్ సింగ్ కి కూడా ఈయనే సంగీతం అందించిన సంగతి మన అందరికి తెలిసిందే..మళ్ళీ అదే కాంబినేషన్ తో వస్తున్నా ఈ సినిమాకి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతుండడం తో అభిమానులు భారీ స్థాయిలోనే అంచనాలు పెట్టుకున్నారు.

    Also Read: BJP Navakumar: బీజేపీకి వాయిస్ గా మారిన ‘నవ కుమార్’

    Recommended Videos:

    Tags