Pavan Fans Warns Director Krish: వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం డైరెక్టర్ క్రిష్ తో హరి హర వీర మల్లు అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించబోతున్నాడు..కెరీర్ లో మొదటిసారి పీరియాడిక్ డ్రామా లో పవన్ కళ్యాణ్ నటించబోతుండడం తో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే టెన్షన్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కనిపిస్తుంది..ఎందుకంటే 50 ఏళ్ళ వయస్సుకు దగ్గర్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి రోల్ లో సూట్ అవుతాడా లేదా..ఒక్కవేల సూట్ అయిన డైరెక్టర్ సరిగా హ్యాండిల్ చేస్తాడా లేదా అని అభిమానులు కంగారు పడుతున్నారు..ఎందుకంటే ఆ చిత్ర దర్శకుడు క్రిష్ లేటెస్ట్ ట్రాక్ రికార్డు ఆలా ఉంది మరి..ఇటీవల ఆయన చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.

ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు మరియు కొండపోలం వంటి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యిందో ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయిందో కూడా ఎవ్వరికి తెలియదు..ఆయన ట్రాక్ రికార్డు చూసి స్టార్ హీరోలు ఎవ్వరు కూడా కనీసం క్రిష్ దగ్గరకి కూడా వెళ్లట్లేదు..అలాంటి క్రిష్ కి పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అవకాశం ఇవ్వడం అంటే నిజంగా సాహసం అనే చెప్పాలి..ఈ సినిమా ఆయన కసితో సరిగ్గా చేస్తే పాన్ ఇండియా లెవెల్ లో మరో డైరెక్టర్ తన సత్తా ని చాటి టాప్ 5 ఇండియన్ డైరెక్టర్స్ లో ఒక్కరిగా నిలుస్తాడు..కానీ తేడా అయితే మాత్రం ఇక ఆయన కెరీర్ క్లోజ్ అయ్యిపోయినట్టే..మరి ఈయన ఈసారి తన టేకింగ్ స్టైల్ ని మార్చి వచ్చిన అవకాశం ని సద్వినియోగం చేసుకుంటాడా లేదా అనేది చూడాలి..ఇప్పటి వరుకు విడుదల అయిన ఈ సినిమా గ్లిమ్స్ మరియు పవన్ కళ్యాణ్ గెటప్ ప్రతి ఒక్కటి అభిమానులను ఆకట్టుకుంది..ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియో లో పవన్ కళ్యాణ్ చేసిన స్తంట్స్ చూసి అభిమానులు షాక్ కి గురి అయ్యారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల కాలం లో ఒక్క పాత్ర కోసం ఇంతలా శ్రద్ద చూపడం ఈ సినిమాకే జరిగింది..హీరో తన వైపు నుండి నూటికి నూరు పాళ్ళు ఎఫ్ర్ట్స్ పెడుతున్నాడు..భయం మొత్తం డైరెక్టర్ క్రిష్ టేకింగ్ మీదనే ఉంది..ఎందుకంటే క్రిష్ మేకింగ్ స్టైల్ , నడిపించే స్క్రీన్ ప్లే విధానం చాలా స్లో గా ఉంటుంది..హరిహర వీర మల్లు లాంటి జానర్ సినిమాలకు స్క్రీన్ ప్లే స్లో గా డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి..ఈ జానర్ లో ఇప్పటి వరుకు ఇండియా లో వచ్చిన సినిమాలు కేవలం ఈ కారణం చేతనే పెద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి..హరి హర వీర మల్లు సినిమాకి క్రిష్ తన స్టైల్ ని మార్చపోతే పక్కాగా ఫలితం తారుమారు అవుతుంది పవన్ కళ్యాణ్ అభిమానులు కంగారు పడుతున్నారు..స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా తీసి పవన్ కళ్యాణ్ నీ మీద పెట్టిన నమ్మకం ని నిలబెట్టుకోలేక పోతే నిన్ను మీ ఇంటికి వచ్చి చావబాదుతాము అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు క్రిష్ ని టాగ్ చేసి సోషల్ మీడియా లో బెదిరిస్తున్నారు..మరి క్రిష్ ఈ సినిమాని ఎలా డీల్ చేస్తాడో చూడాలి.
Recommended Videos:



