https://oktelugu.com/

సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి నిరాశ..!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ హై కోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసుపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్సెషల్ లీవ్ పిటీషన్ పై సుప్రీం ధర్మాసనం ఈ రోజు విచారించింది. కోర్టు దిక్కరణ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వచ్చే శుక్రవారం లోగా హై కోర్టు ఆదేశాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించక తప్పే పరిస్థితి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 24, 2020 1:45 pm
    Follow us on

    AP SEC issue
    నిమ్మగడ్డ రమేష్ కుమార్ హై కోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసుపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్సెషల్ లీవ్ పిటీషన్ పై సుప్రీం ధర్మాసనం ఈ రోజు విచారించింది. కోర్టు దిక్కరణ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వచ్చే శుక్రవారం లోగా హై కోర్టు ఆదేశాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించక తప్పే పరిస్థితి కనిపించడం లేదు.

    స్పెషల్ లీవ్ పిటీషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం వైఖరిపై సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. హై కోర్టు ఆదేశాలను అమలు చేయాలని గవర్నర్ ఆదేశించినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. కేసులో అసలు ఈ పరిస్థతి ఎందుకు వచ్చిందని అని చెప్పాలంది. అదేవిధంగా న్యాయస్థానాలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినప్పుడు న్యాయమూర్తులను, తీర్పులను తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టుల పెట్టిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లడంతో తీవ్రంగా స్పందించింది. ఆ వివరాలను తమకు సమర్పించాలని కోరింది.

    Also Read: నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వ వైఖరి మారదా?

    నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎస్ఇసిగా కోనసాగించాలని గతంలో హై కోర్టు ఇచ్చిన తీర్పుపైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. ఈ పీటీషన్ లపైన విచారించిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. హై కోర్టు ఆదేశాలను అమలు చేయాలని గతంలోనే సూచించింది. అయినప్పటికీ ప్రభుత్వం నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది.

    మరోవైపు నిమ్మగడ్డ అభ్యర్ధన మేరకు గవర్నర్ నిమ్మగడ్డ కేసులో హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి సూచనలు చేశారు. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ సాకుగా చూపి ప్రభుత్వం ఈ అంశంపై తన నిర్ణయాన్ని ప్రకటించకుండా దాట వేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులోను ప్రభుత్వానికి నిరాశే ఎదురవడంతో నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తి కరంగా మారింది.

    Also Read: అమ్మకానికి అమరావతి భూములు..!